Shikar Dhawan: ధావన్ దీక్షకు కారణం ఏంటి?
ఆసియా కప్ లో స్థానం దక్కకపోయినా.. వరల్డ్ కప్ లో తనను తీసుకుంటారని అంతా భావించినా.. ఈ సీనియర్ ఆటగాడికి నిరాశ తప్పలేదు.

Shikhar Dhawan did not get a place in Team India World Cup
టీమిండియా స్టార్ ఓపెనర్, సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ కి వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కని సంగతి తెలిసిందే. ఆసియా కప్ లో స్థానం దక్కకపోయినా.. వరల్డ్ కప్ లో తనను తీసుకుంటారని అంతా భావించినా.. ఈ సీనియర్ ఆటగాడికి నిరాశ తప్పలేదు. ఐసీసీ టోర్నీల్లో అద్భుత రికార్డ్ కలిగి ఉన్నప్పటికీ ఫామ్ లేని కారణంగా వరల్డ్ కప్ జట్టులో ధావన్ ని సెలక్ట్ చేయలేదు. అయితే ప్రస్తుతం ధావన్ చేసిన పనికి అందరూ హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
సాధారణంగా అర్హత కలిగిన ఒక ప్లేయర్ ని జట్టులో ఎంపిక చేయకపోతే సెలక్టర్ల మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, సంచలన కామెంట్స్ చేయడం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ శిఖర్ ధావన్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాడు. తనని జట్టులో ఎంపిక చేయకపోయినా జట్టు గెలవాలని పూజలు చేస్తున్నాడు. ఉజ్జయినిలోని బాబా మహాకాళేశ్వర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిర్లింగ దేవాలయంలో శిఖర్ ధావన్ ప్రార్థనలు చేస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా కూడా ఉండడం మరో విశేషం. కొన్ని రోజుల క్రితం గబ్బర్..టీమిండియా గెలవాలని విష్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా టెంపుల్ లో కనిపించి తాను ఎంత స్పోర్టీవ్ గా ఉంటాడో మరోసారి తెలియజేశాడు. ఈ సందర్భంగా అందరి అభిమానుల లాగే నేను కూడా భారత్ వరల్డ్ కప్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపాడు.