Sania Mirza: సానియాతో విడాకులు.. పాక్‌ నటిని పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్‌

షోయబ్‌ మాలిక్‌ పాకిస్థాన్‌ నటి సనా జావెద్‌ను నిఖా చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాలిక్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. అల్‌హమ్మదులిల్లా అంటూ రాసుకొచ్చాడు. మాలిక్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 20, 2024 | 02:35 PMLast Updated on: Jan 20, 2024 | 2:36 PM

Shoaib Malik Marries Pak Actress Sana Javed Amid Rumours Of Separation With Sania Mirza

Sania Mirza: పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి చేసుకున్నాడు. గతంలో భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను నిఖా చేసుకున్న మాలిక్‌.. ఆమెతో కొంతకాలంగా దూరంగా ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, విడాకులు తీసుకున్నారనే విషయం మాత్రం బయటికి రాలేదు. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతున్నారని కూడా మీడియాలో బాగా ప్రచారం జరిగింది. అయితే.. విడాకులపై అటు మాలిక్‌ కానీ, ఇటు సానియా కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు.

KTR: రేవంత్ రక్తం బీజేపీదే.. వంద రోజుల్లో హామీలు అమలు చెయ్.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్..

తాజాగా షోయబ్‌ మాలిక్‌ పాకిస్థాన్‌ నటి సనా జావెద్‌ను నిఖా చేసుకున్నాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను మాలిక్‌ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. అల్‌హమ్మదులిల్లా అంటూ రాసుకొచ్చాడు. మాలిక్‌ మళ్లీ పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది. షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకోవడం మాత్రం సంచలనంగా మారింది. షోయబ్‌ మాలిక్‌-సానియా దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ మధ్య కొడుకు పుట్టిన రోజు సందర్భంగా మాలిక్‌-సానియాలు కలుసుకున్నారు. కానీ ఫొటోలు మాత్రం కలిసి దిగలేదు. కుమారుడితో విడివిడిగా ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశారు. సానియాను పెళ్లి చేసుకోవడానికి ముందే.. మాలిక్‌ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత సానియాను రెండో వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

షోయబ్‌‌కు సానియాతో విభేదాలు ఉన్నాయని బయటికి వచ్చింది. కానీ, విడాకులు కూడా తీసుకున్నారనే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. అయితే.. ఇప్పటికీ వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా? లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ఇస్లాం ప్రకారం విడాకులు తీసుకున్నారా? గుట్టుచప్పుడు కాకుండా కోర్టు ద్వారానే విడాకులు తీసుకున్నారా ఒక వేళ కోర్టు ద్వారా విడాకులు తీసుకుంటే.. ఇండియాలో తీసుకున్నారా? పాకిస్థాన్‌లో తీసుకున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది.