Sania Mirza Son : షోయబ్ చేసిన తిక్క పనికి.. సానియా కొడుక్కి కష్టాలు
భారత టెన్నిస్ (Indian Tennis) స్టార్ సానియా మీర్జా(Star Sania Mirza), పాక్ క్రికెటర్ (Pak Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik) ఈమధ్యే విడిపోయారు. వీళ్ళిద్దరికీ ఇషాన్ మిర్జా మాలిక్ (Ishaan Mirza Malik) అనే కొడుకు కూడా ఉన్నాడు. పాకిస్తాన్ నటి సనా జావెద్ ను షోయబ్ పెళ్ళి చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఇప్పుడు షోయబ్ మూడో పెళ్ళి...అభం శుభం ఎరుగని ఐదేళ్ళ ఇషాన్ పై తీవ్ర ప్రభావం పడింది.

Shoaib's hard work.. Sania's son is suffering
భారత టెన్నిస్ (Indian Tennis) స్టార్ సానియా మీర్జా(Star Sania Mirza), పాక్ క్రికెటర్ (Pak Cricketer) షోయబ్ మాలిక్ (Shoaib Malik) ఈమధ్యే విడిపోయారు. వీళ్ళిద్దరికీ ఇషాన్ మిర్జా మాలిక్ (Ishaan Mirza Malik) అనే కొడుకు కూడా ఉన్నాడు. పాకిస్తాన్ నటి సనా జావెద్ ను షోయబ్ పెళ్ళి చేసుకొని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే ఇప్పుడు షోయబ్ మూడో పెళ్ళి…అభం శుభం ఎరుగని ఐదేళ్ళ ఇషాన్ పై తీవ్ర ప్రభావం పడింది. ఇషాన్ దుబాయ్ లో చదువుకుంటున్నాడు. మీ నాన్న మూడో పెళ్ళి చేసుకున్నాడట అంటూ స్కూల్లో తోటి విద్యార్థులు ఎగతాళి చేస్తుండటంతో ఆ చిన్న హృదయం తట్టుకోలేకపోతోంది. అందుకే స్కూల్ కూడా మాన్పించినట్టు పాకిస్తాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా చెప్పింది. కొడుకును తీసుకొని హైదరాబాద్ తిరిగి వచ్చింది.
సానియాతో విడిపోయిన తర్వాత షోయబ్ మూడో పెళ్ళి చేసుకొని… తన ఘనకార్యాన్ని సోషల్ మీడియా(Social Media) లో పంచుకున్నాడు. ఈ ఫోటోలు పాకిస్తాన్ తో పాటు భారత్ లో నూ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలే ఇప్పుడు సానియా-షోయబ్ (Sania-Shoaib) కొడుకు ఇషాన్ కు ఇబ్బందిగా మారాయి. నాన్న మూడో పెళ్ళి చేసుకోవడం… వేరే అమ్మాయితో ఫోటోలు దిగడం చూసి ఇషాన్ అప్ సెట్ అయ్యాడట. విదేశాల్లో చదువుకుంటున్న ఇషాన్ ను తోటి ఫ్రెండ్స్ ఇదే విషయం అడుగుతుండటంతో ఆ చిన్నారి ఇంకా బాధపడ్డాడు. పరిస్థితి చేజారి పోవడంతో బాబుని స్కూల్ మాన్పించినట్టు సానియా మీర్జా పాకిస్తాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. కొడుకుతో కలసి హైదరాబాద్ కి తిరిగి వచ్చింది సానియా. ఇషాన్ తో పాటు సానియా సోదరి కూతురు దువాను హగ్ చేసుకుంటున్న ఫోటోని సానియా Insta లో పోస్ట్ చేసింది.
సనా జావెద్ ను షోయబ్ పెళ్ళి చేసుకున్నాక ఆయనపై సోషల్ మీడియాలో కామెంట్స్ పెరిగిపోతున్నాయి. షోయబ్ వైఖరిని చాలామంది తప్పుబడుతున్నారు. షోయబ్ మూడో పెళ్ళి చేసుకోవడం చాలామంది పాకిస్తానీలకు నచ్చడం లేదు. ఆయన కుటుంబం కూడా ఈ పెళ్ళిని వ్యతిరేకించినట్టు తెలుస్తోంది. అత్తమామలు కూడా సానియాకు అండగా నిలబడ్డారు. షోయబ్ – సనా మ్యారేజ్ కి కూడా వాళ్ళు అటెండ్ అవ్వలేదు. ఇక సానియా మీర్జా మీద నెటిజన్స్ లో సింపతీ పెరుగుతోంది. ఈ విడాకుల ఎపిసోడ్ తర్వాత సానియా మీర్జాకు ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్ల సంఖ్య కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఆమెను దాదాపు 13 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. గత నెల రోజుల్లోనే సానియాకు దాదాపు 3 లక్షల మంది అభిమానులు పెరిగినట్టు హైప్ ఆడిటర్ రిపోర్ట్ తెలిపింది. ఇండియాలోనే కాదు పాకిస్తాన్ లోనూ సానియాను ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది.