అక్షర్ పటేల్ కు షాక్, రూ.12 లక్షల జరిమానా
ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడి బాధలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు షాక్ తగిలింది. అతడికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. రూ.12 లక్షల ఫైన్‌ను విధించినట్లు కమిటీ ప్రకటించింది.

ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఓడి బాధలో ఉన్న దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు షాక్ తగిలింది. అతడికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. రూ.12 లక్షల ఫైన్‌ను విధించినట్లు కమిటీ ప్రకటించింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ తమ 20 ఓవర్ల కోటాను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా దిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్‌కు ఫైన్ విధించింది.ఈజీగా గెలవాల్సిన ఈ మ్యాచులో ఆఖర్లో మూడు వరుస బంతుల్లో మూడు రనౌట్లు దిల్లీ కొంప ముంచాయి. ఇకపోతే ఈ సీజన్ లో దిల్లీ కెప్టెన్ అక్సర్ పటేల్ పర్వాలేదనిపించే ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో 84 బంతులు ఎదుర్కొని 137 పరుగులు చేశాడు. వికెట్లు మాత్రం తీయలేదు. అయితే కెప్టెన్ గా మాత్రం జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు