BRS : బీఆర్‌ఎస్‌కు షాక్‌.. ఎమ్మెల్యే నామినేషన్‌ తిరస్కరణ..

ఎన్నికల అఫిడవిట్ల విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన తప్పులు మాత్రం జరిగిపోయాయి. అఫిడవిట్లు పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ లీగల్‌ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ.. ఏకంగా ఎమ్మెల్యే నామినేసన్‌ తిరస్కరణకు గురవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2023 | 01:31 PMLast Updated on: Nov 14, 2023 | 1:31 PM

Shock For Brs Rejection Of Mla Nomination

ఎన్నికల అఫిడవిట్ల (Election Affidavits) విషయంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన తప్పులు మాత్రం జరిగిపోయాయి. అఫిడవిట్లు పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ లీగల్‌ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ.. ఏకంగా ఎమ్మెల్యే నామినేసన్‌ తిరస్కరణకు గురవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు (Kalvakuntla Vidya Sagar Rao) ఎన్నికల నామినేషన్‌ను తిరస్కరించారు అధికారులు. కేవలం ఇది మాత్రమే కాదు.. మొత్తం 608 నామినేషన్లను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాలకు గాను.. 4 వేల 798 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో 608 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. విద్యాసాగర్‌ రావుతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి నామినేషన్‌ను కూడా తిరస్కరించారు. మిర్యాల గూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్‌, హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌ భార్య ఈటెల జమున నామినేషన్‌ తిరస్కరించారు. అయితే ఈ నామినేషన్లను ఎందుకు తిరస్కరించారు.

MLA Sitakka : సీతక్కను ఓడించేందుకు 200 కోట్లు !?

అఫిడవిట్లలో ఉన్న తప్పులేంటి అనే విషయాలను ఇప్పటి వరకూ అధికారుల వివరించలేదు. 608లో ముగ్గురు అభ్యర్థులు మూడు కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో నామినేషన్‌ వేసిన కారణంగా తిరస్కరిస్తున్నామంటే చెప్పారు. నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాల కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయకూడదు. ఇక ఖమ్మం, దేవరకద్ర, పాలకుర్తి, అలంపూర్‌ స్థానాల్లో వచ్చిన ఫిర్యాదులను తోసిపుచ్చారు అధికారు. మంత్రి పువ్వాడ అజయ్‌ అఫిడవిట్‌లో తప్పులు ఉన్నాయంటూ జలగం వెంకట్రావు చేసిన ఫిర్యాదును తిరస్కరించారు. దేవరకద్రలో కాంగ్రెస్‌ అభ్యర్థి మధుసూదన్‌ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉందని బీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఫిర్యాదును కూడా తోసిపుచ్చింది. ఇక పాలకుర్తిలో కాంగ్రెస్‌ అభ్యర్థి యశశ్విని రెడ్డికి మూడు ఇంటి అడ్రెస్‌లు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చాయి. నిబంధనల ప్రకారం అలా అడ్రెస్‌లు ఉండొచ్చంటూ అధికారులు ఫిర్యాదును తిరస్కరించారు. వివాదాస్పదంగా మారిన అలంపూర్‌ అభ్యర్థి వ్యవహారాన్ని కూడా అధికారులు తిరస్కరించారు. అలంపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తూ నామినేషన్‌ వేశాడంటూ కాంగ్రెస్‌ ఫిర్యాదు చేసింది. దీనిపై ఎలాంటి ఆధారాలు లేవంటూ అధికారులు ఫిర్యాదును తోసిపుచ్చారు. ఇలా మొత్తం 608 మంది అభ్యర్థుల నామినేషన్స్‌ను క్యాన్సిల్‌ చేశారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేస్తామన్నారు.