Shubman Gill : శుభ్‌మన్ గిల్‌కు షాక్
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) విజయంతో జోష్ లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కు షాక్ తగిలింది.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) పై గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) విజయంతో జోష్ లో ఉన్న ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కు షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్‌కు బీసీసీఐ 24 లక్షల భారీ జరిమానా విధించింది. అంతేగాక గుజరాత్ జట్టులోని ప్లేయర్లందరికీ రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. ఇంపాక్ట్ ప్లేయర్‌కు కూడా ఈ ఫైన్ వేసింది. స్లో ఓవర్ రేట్ కారణంగా గిల్ జరిమానాకు గురికావడం ఈ సీజన్‌లో రెండోసారి. అయితే ఛేజింగ్‌లో గిల్ గుజరాత్ జట్టును నడిపించలేదు. 18 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన గిల్ తిమ్మిర్లతో ఇబ్బంది పడడంతో డగౌట్‌లోనే కూర్చొన్నాడు. దీంతో గిల్ స్థానంలో రాహుల్ తెవాతియా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 35 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.