T Congress: తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం కొత్త సర్వేలో సంచలన విషయాలు

తెలంగాణ రాజకీయం భగ్గుమంటోంది. నేతలంతా జనాల్లోనే కనిపిస్తున్నారు. అభివృద్ధి వేగం పుంజుకుంది.. నేతల ఆప్యాయతలకు హద్దుల్లేకుండా పోతున్నాయ్. అంతా ఎలక్షన్ మాయ అని నవ్వుకోవడం జనాల వంతు అయింది ఇప్పుడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 6, 2023 | 02:56 PMLast Updated on: Oct 06, 2023 | 2:57 PM

Shocking Things Have Come To Light That Congress Will Win The Lok Poll Survey In Telangana

తెలంగాణ రాజకీయం భగ్గుమంటోంది. నేతలంతా జనాల్లోనే కనిపిస్తున్నారు. అభివృద్ధి వేగం పుంజుకుంది.. నేతల ఆప్యాయతలకు హద్దుల్లేకుండా పోతున్నాయ్. అంతా ఎలక్షన్ మాయ అని నవ్వుకోవడం జనాల వంతు అయింది ఇప్పుడు. ఇదంతా ఎలా ఉన్నా.. తెలంగాణలో మాములు హడావుడి కనిపించడం లేదు ఇప్పుడు. రేపోమాపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రాబోతోంది. ఐతే ఇప్పటికే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్ని కసరత్తు మొదలు పెట్టేశాయ్. ఇందులో అధికార పార్టీ ఓ అడుగు ముందే ఉంది. 115 స్థానాలకు మొదటి విడతలో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత జనగామ టికెట్‌ పల్లాకు ఫిక్స్ చేశారు. బీఎస్పీ 20మందితో లిస్ట్ రిలీజ్ చేయగా.. అటు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల జాబితాకు ఫైనల్ టచ్చింగ్స్ ఇస్తున్నాయ్.

ఇక అటు అన్ని పార్టీలు షెడ్యూలు విడుదలకు ముందే రాష్ట్రమంతా బహిరంగ సభలు నిర్వహిస్తూ.. రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నాయ్. హ్యాట్రిక్ అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతుంటే.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికార పీఠంపై కూర్చుకోవాలని కాంగ్రెస్ పట్టుదలతో కనిపిస్తోంది. బీజేపీ కూడా తగ్గేదే లే అంటోంది. మోదీ రెండు సభల తర్వాత కమలం పార్టీలో కొత్త జోష్‌ కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రీపోల్ సర్వేలు.. పాలిటిక్స్‌ను మరింత ఆసక్తికరంగా మారుతున్నాయ్. కేసీఆర్‌దే మళ్లీ అధికారం అని కొన్ని సర్వేలు చెప్తుంటే.. మరికొన్ని సర్వేల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. దాదాపు మెజారిటీ సర్వేలు.. కారుదే జోరు అని చెప్తున్నాయ్.

ఇలాంటి సమయంలో లోక్ పోల్ సర్వేలో మాత్రం హస్తానిదే హవా నడుస్తుందని తేల్చింది. అధికార బీఆర్ఎస్ పార్టీకి 45 నుంచి 51 సీట్లు మాత్రమే వస్తాయని.. కాంగ్రెస్‌ పార్టీకి మాత్రం 61 నుంచి 67 సీట్లు వస్తాయని లోక్‌పోల్ సర్వే నివేదికలో ఉంది. ఈసారి తెలంగాణలో తప్పకుండా కాషాయ జెండా ఎగరేస్తామని చెప్తున్న బీజేపీ మాత్రం.. 2 నుంచి 3 సీట్లకే పరిమితం కానుందని సర్వే ఫలితాలు చెప్తున్నాయ్. ఎంఐఎంకు 6 నుంచి 8 సీట్లు వస్తాయని.. ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశాలున్నట్టు లోక్‌పోల్‌ సర్వే చెప్తోంది. సీట్ల విషయంలో బీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పార్టీకి సుమారు 15సీట్లకు పైగానే తేడా కనిపిస్తున్నా.. ఓటింగ్ విషయంలో మాత్రం పెద్దగా డిఫరెన్స్ కనిపించట్లేదు.

బీఆర్ఎస్ పార్టీకి 39 నుంచి 42 శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేయగా.. కాంగ్రెస్‌కు కూడా 41 నుంచి 44 శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని సర్వే చెప్తోంది. ఇక 2 నుంచి 3 సీట్లు మాత్రమే గెలుచుకునే బీజేపీ మాత్రం 10 నుంచి 12 శాతం ఓటింగ్ సంపాధించుకునే అవకాశం ఉంది. ఆరు నుంచి 8 సీట్లు గెలుచుకునే ఎంఐఎం పార్టీకి మాత్రం మూడు నుంచి 4 శాతం ఓటింగే వచ్చే అవకాశం ఉందని లోక్‌పోల్ సర్వేలో తేలింది. ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 30 వరకు తీసుకున్న 60వేల శాంపిల్స్ ఆధారంగా ఈ సర్వే చేసినట్టు లోక్‌ పోల్ సంస్థ తెలిపింది.