పాముకు హీరో పేరు
ఇండియా, జర్మనీ, యూకేకు చెందిన సైంటిస్టుల టీం పశ్చిమ హిమాలయాల్లో ఓ కొత్త పాముల జాతిని కనిపెట్టింది. ఈ భూమ్మీద ఇలాంటి పామును చూడటం ఇదే మొదటిసారి. బ్రౌన్ కలర్‌లో ఉండే ఈ పాము జాతి 22 ఇంచులు మాత్రమే పెరుగుతుంది.
ఇండియా, జర్మనీ, యూకేకు చెందిన సైంటిస్టుల టీం పశ్చిమ హిమాలయాల్లో ఓ కొత్త పాముల జాతిని కనిపెట్టింది. ఈ భూమ్మీద ఇలాంటి పామును చూడటం ఇదే మొదటిసారి. బ్రౌన్ కలర్‌లో ఉండే ఈ పాము జాతి 22 ఇంచులు మాత్రమే పెరుగుతుంది. నిజానికి 2020లోనే ఈ పామును గుర్తించారు. కానీ ఇలాంటి పాములు ఇంకా భూమ్మీద ఉన్నాయా లేదా అనే పరిశోధనలు ఇంతకాలం సాగాయి. ఫైనల్‌గా దీన్ని కొత్త జాతిగా గుర్తించిన సైంటిస్టులు దీనికి ఓ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో పేరును సెలెక్ట్ చేసుకున్నారు. ఈ పాము జాతికి అంగ్యుక్యులస్ డికాప్రియో, డికాప్రియో హిమాలయన్ స్నేక్‌గా పేరు పెట్టారు. పర్యావరణాన్ని కాపాడేందుకు డికాప్రియో చేసిన కృషికిగాను ఈ పాముకు ఆయన పేరుపెట్టినట్టు నిర్ధారించారు సైంటిస్టులు.