ఫామ్ లోకి శ్రేయాస్ అయ్యర్, రంజీల్లో వరుసగా 2వ సెంచరీ
పేలవ ఫామ్ తో జాతీయ జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ రంజీల్లో అదరగొడుతున్నాడు. రీఎంట్రీ కోసం కష్టపడుతున్న శ్రేయాస్ వరుస సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ సీజన్లో మహారాష్ట్రపై శతక్కొట్టిన శ్రేయస్.. తాజాగా ఒడిషాపై సెంచరీతో కదంతొక్కాడు.
పేలవ ఫామ్ తో జాతీయ జట్టుకు దూరమైన శ్రేయాస్ అయ్యర్ రంజీల్లో అదరగొడుతున్నాడు. రీఎంట్రీ కోసం కష్టపడుతున్న శ్రేయాస్ వరుస సెంచరీలతో దుమ్మురేపాడు. ఈ సీజన్లో మహారాష్ట్రపై శతక్కొట్టిన శ్రేయస్.. తాజాగా ఒడిషాపై సెంచరీతో కదంతొక్కాడు. ఒడిషాపై శ్రేయస్ 101 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. దీనిలో 14 బౌండరీలు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ శ్రేయస్‌కు ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇది 15వ సెంచరీ. శ్రేయాస్ సెంచరీతో సత్తా చాటడంతో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్‌తో సిరీస్ అనంతరం జట్టులో చోటు కోల్పోయిన శ్రేయస్.. ఆతర్వాత సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. ఇప్పుడు వరుస సెంచరీలతో సెలెక్టర్లకు సవాలు విసిరాడు.