Covaxin : కోవాగ్జిన్ తో సైడ్ ఎఫెక్ట్స్

కరోనా వస్తే 14 రోజులు క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ టీకాలేంటిరా బాబూ... మన ప్రాణాలను తోడేస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ తో జీవితకాలం వెంటాడుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 17, 2024 | 11:02 AMLast Updated on: May 17, 2024 | 11:02 AM

Side Effects With Covagin Include Blood Clotting Platelets Down

 

 

 

  • రక్తగడ్డ కట్టడం, ప్లేట్ లెట్స్ డౌన్
  • కోవాగ్జిన్ తోనూ సైడ్ ఎఫెక్ట్స్
  • బెనారస్ వర్సిటీ షాకింగ్ రిపోర్ట్

కరోనా వస్తే 14 రోజులు క్వారంటైన్ ఉంటే సరిపోతుంది. కానీ ఈ టీకాలేంటిరా బాబూ… మన ప్రాణాలను తోడేస్తున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ తో జీవితకాలం వెంటాడుతున్నాయి. అని జనం పరేషాన్ అవుతున్నారు. మొన్నటికి మొన్న కరోనా టీకా కోవీషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని బయటపడితే… ఇప్పుడు కోవాగ్జిన్ కూడా డేంజర్ అని స్టడీస్ బయటపెట్టాయి. దాంతో ఈ టీకాలు వేసుకున్న జనం బెంబేలెత్తుతున్నారు.

కరోనా టీకా కోవాగ్జిన్ కూడా డేంజర్ అనీ… దాని వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బనారస్ హిందూ యూనివర్సిటీ సంచలన నివేదిక బయటపెట్టింది. దాంతో మొన్నటి దాకా హమ్మయ్య… కోవాగ్జిన్ సేఫ్ అని ఫీల్ అవుతున్న జనం ఆందోళనలో పడ్డారు. ఈ యూనివర్సిటీ చేసిన స్టడీస్ రిపోర్ట్… స్ప్రింగర్ లింగ్ అనే జర్నల్ లో పబ్లిష్ అయింది. కోవాగ్జిన్ వల్ల శ్వాస కోశ సమస్యలు తలెత్తుతున్నట్టు తమ అధ్యయనంలో తేలినట్టు బెనారస్ హిందూ వర్సిటీ రిపోర్ట్ చెబుతోంది. అలెర్జీ సమస్యలున్న యుక్తవయస్సు అమ్మాయిల్లో కోవాగ్జిన్ టీకా తీసుకోవడం వల్ల తీవ్ర పరిణామాలు ఉంటాయని అంటోంది. 635 మంది యువత, 291 పెద్దలు మొత్తం ఒక వెయ్యి 24మందిపై కోవాగ్జిన్ టీకాను ఏడాది పాటు పరీక్షించారు బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు.

యూత్ లో 48.9 శాతం మందిలో… అలాగే పెద్ద వాళ్ళల్లో 42.6శాతం మందిలో వైరల్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్… అంటే శ్వాసకోశ సమస్యలు లాంటివి తలెత్తాయి. AESI రకం సైడ్ ఎఫెక్ట్స్ అంటే… అనాలిలాక్సిస్, మయో కార్డిటిస్, త్రోంబోసిస్… అంటే రక్తం గడ్డకట్టడం, ప్లేట్ లెట్స్ పడిపోవడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయని తేల్చింది. AESI రకం సైడ్ ఎఫెక్ట్స్ తో కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని బెనారస్ హిందూ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. మరికొందరికి గులియన్ – బారే సిండ్రోమ్ వచ్చే రిస్క్ ఉంటుంది. మహిళల్లో పీరియడ్స్, మస్కులో స్కెలటల్ ప్రాబ్లెమ్స్ కూడా తలెత్తుతాయి.

కోవీషీల్డ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని… బ్రిటన్ కోర్టులో ఆస్ట్రాజెనికా ఒప్పుకోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇది వెలుగులోకి వచ్చాక… కోవాగ్జిన్ టీకాకు సేఫ్టీ రికార్డు ఉందని భారత్ బయోటెక్ ప్రకటించింది. భద్రతే లక్ష్యంగా టీకాను తయారు చేశామనీ… ఎంతో సమర్థంగా పనిచేస్తుందని భారత్ బయోటెక్ చెప్పింది. ట్రయల్స్ లోనూ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయని ప్రకటించింది. కోవిడ్ 19 వ్యాక్సిన్స్ లో ఈ రికార్డు కేవలం కోవాగ్జిన్ కి మాత్రమే ఉందని కూడా భారత్ బయోటెక్ గర్వంగా ప్రకటించింది. కానీ కోవాగ్జిన్ తోనూ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బనారస్ హిందూ యూనివర్సిటీ రిపోర్టు బయటపెట్టడం సంచలనంగా మారింది. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం ఈ రిపోర్టుపై ఇంకా స్పందించలేదు. కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న జనంలో ఆందోళన మొదలైంది.