సికిందర్ విధ్వంసం రోహిత్ రికార్డు బ్రేక్
టీ ట్వంటీల్లో ఇప్పుడు సెంచరీలు కామన్ గా మారిపోయాయి. బ్యాటర్లు విధ్వంసం కొనసాగుతున్న వేళ జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు

టీ ట్వంటీల్లో ఇప్పుడు సెంచరీలు కామన్ గా మారిపోయాయి. బ్యాటర్లు విధ్వంసం కొనసాగుతున్న వేళ జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు కేవలం 33 బంతుల్లోనే శతకం బాది.. టీమిండియా సారథి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్స్‌లో గాంబియాతో మ్యాచ్ లో అతను ఈ రికార్డు సాధించాడు. సికిందర్ రాజా దెబ్బకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు డేవిడ్ మిల్లర్ పేరిట ఉన్న రికార్డులు కూడా బ్రేక్ అయ్యాయి. టెస్టు హోదా దేశపు ఆటగాళ్లలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా సికందర్ రజా వరల్డ్ రికార్డు సృష్టించాడు.