A Mud Volcano : బురద అగ్నిపర్వతాల్లో స్నానాలు చేద్దాం..!
ఇది ఒక అగ్ని పర్వతం.. సలసల మరిగే నిప్పులు కక్కతు.. ఎర్రటి లావా కారదు.. ఆకశాన్ని కమ్మేసే బుడిద చిమ్మదు.. దట్టమైన పొగలు రావు.. అయిన అది ఒక అగ్ని పర్వతం అనే బురద అగ్ని పర్వతం.. దీన్ని ముట్టుకోవచ్చు.. దాట్లోకి దిగి స్నానాలు చేయవచ్చు ..
అగ్నిపర్వతాలు ఆ పదంతో మనకు పరిచయం అక్కర్లేదు..ఎందుకంటే ఆ పద్దాన్ని మన చిన్నతనం నుంచి వింటునే ఉన్నాం.. చాలా సార్లు వాటిని టీవీల్లోనూ నేరుగానో చూసి ఉంటాము కూడా.
ఇది ఒక అగ్ని పర్వతం.. సలసల మరిగే నిప్పులు కక్కతు.. ఎర్రటి లావా కారదు.. ఆకశాన్ని కమ్మేసే బుడిద చిమ్మదు.. దట్టమైన పొగలు రావు.. అయిన అది ఒక అగ్ని పర్వతం అనే బురద అగ్ని పర్వతం.. దీన్ని ముట్టుకోవచ్చు.. దాట్లోకి దిగి స్నానాలు చేయవచ్చు ..
మనం ఇంతవరకు సలసల రగిలే ఎర్రటి ద్రవం కరిగిన లావా ఉన్నట్లు వంటి అగ్నిపర్వతాలను చూసా.. హిమాలయల్లో ఉండే అగ్నిపర్వతాలను చూశా..సముద్రపు నీటి అడుగున ఉండే అగ్నిపర్వతాలు కూడా చూశాం.. మరి ఇప్పుడు చెప్పబోయేది మీరు చూడబోయేది మట్టితో కూడిన బురద అగ్నిపర్వతం వినడానికి వింతగా ఉంది కాదు.. మీరు చూస్తే ఏకంగా స్నానాలే చేస్తారు మరీ.. అగ్నిపర్వతం లో స్నానాలు అని అడుగుతున్నారా.. అయితే ఇది మీకోసమే ..
నిప్పులు కక్కుతున్న అగ్నిపర్వతం.. వందల డిగ్రీల ఉష్ణోగ్రతో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్లాలంటేనే భయం కలుగుతుంది. దాన్ని దూరం నుంచి చూసి తరించాలనే తప్ప దాన్ని ముట్టుకునే సాహసం ఎవరు చేయరు ఈ భూమి మండలం పై ఉన్న మనుషులు.
బురద అగ్నిపర్వతం..
అజర్ బైజాన్ అగ్నిపర్వతాలు పేలితే నిప్పులు ఎగసిపడతాయి. లావా వాగులై పారుతాయి.. కానీ ఇక్కడ సలసలకాగే బురద వరదలుగా పారుతుంది. నిజానికి ఇవి అగ్నిపర్వతాలు కావు, అందుకే వీటికి బురద అగ్నిపర్వతాలు అని పేరు. రాజధాని బాకు నగరం నుంచి గంటన్నర ప్రయాణం చేస్తే దాష్ గిల్ అనే ప్రదేశం వస్తుంది. ఇక్కడ దాదాపు 700 ‘దాకా మడ్ వాల్కెనోలు’ ఉన్నాయి. దాకా మడ్ వాల్కెనోలు అధిక సంఖ్యలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని “బురద పర్వతాల” ప్రాంతం పిలుస్తారు. సాధారణ అగ్నిపర్వతాల్లా వీటిలో లావా రాదు. వీటి నుంచి సలసల మరిగే బురద వస్తుంది. అది కూడ ఒకనోక సమయంలో తక్కువ ఉష్ణోగ్రతతో బురద పారుతుంది. కాబట్టి యాక్టివ్ గా ఉన్నప్పుడు మినహా మిగతా సమయాల్లో హానికరమైనవి కావు.
“ల్యాండ్ ఆఫ్ ఫైర్” బురద అగ్నిపర్వతాలు ఎలా ఏర్పడ్డాయి..?
బురద అగ్నిపర్వతాలు, మట్టి గోపురాలు భూమి విసర్జించిన ద్రవాలు, భూమి లోపలి పొరల ఒత్తడి ఏర్పడి, పై భాగంలో ఫాల్ట్ ఉన్నచోట ఇలా వోల్కనోలు పేలి అగ్ని పర్వతాల నుంచి బురద, బూడిద వెలువడి. క్రమేపి భూమి లోపలి పొరల నుంచి విసర్జించిన ద్రవాలు భూమి పై భాగానికి వచ్చిన అనంతరం అక్కడి వాతవరణం కు అవి ఘన రూపంలోకి మారుతాయి వీటి కు తోడు వాయువుల మిక్స్ అయి అవి గోపురాలుగా తయారవుతాయి. అయితే, వీటి ఏర్పాటుకు కారణమయ్యే ఇతర ప్రక్రియలు, ఇతర ద్రవాలు, వాయువులు కూడా ఉన్నాయి.
వీటి పరిమాణం, పొడవు.. ?
బురద అగ్నిపర్వతాలు అతిపెద్ద నిర్మాణాలు 10 కిలోమీటర్ల వ్యాసం, 700 మీటర్ల ఎత్తు వరకూ గోపురాలుగా ఏర్పడుతాయి. పొడవాటి గొట్టంలా కనిపించే వీటిని చూస్తే బురద కాలుతూ పొగ వస్తూ ఉంటుంది. అంతర్గతంగా ఉన్న సహజ వాయువుల ప్రభావం ఇది. ఒక్కో బురద అగ్నిపర్వతం 1 నుంచి 2 మీటర్ల 10 కిలోమీటర్ల వెడల్పు ఉన్నవి కూడా లేకపోలేదు. సాధారణంగా వీటి నుంచి మనుషులకు ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ.. అంత్య క్లిష్టపరిత్తుతులో మత్రమే ఇవి విస్ఫోటన్ చేందుతాయి. ఆలా పేలే సమయంలో సమీప ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారు.
అగ్నిపర్వాతల వాయువులు.. స్వేచ్ఛ వాయువులు/ విషవాయువులు..
సాధారణ అగ్నిపర్వతాల్లో మనుషులకు హాని కలిగించే విష వాయువులు ఉన్నాయి. కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ప్రధాన అగ్నిపర్వత హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ ఫ్లోరైడ్ ఉన్నాయి. హైడ్రోజన్, కార్బన్ మోనాక్సైడ్, హాలోకార్బన్, సేంద్రీయ సమ్మేళనాలు, అస్థిర లోహ క్లోరైడ్. ఇది పర్యావరణం కు ముఖ్యంగా మానవ జీవన మనుగడకు అత్యంత ప్రమాదం కలిగిస్తాయి..
బురద అగ్ని పర్వతాలలో ఉండే వాయువులు..
అదే బురద అగ్నిపర్వతాలు నుండి వెలువడే వాయువులు పర్యావరణం కు మనుషులకు ఎలాంటి హాని కలిగించవు. వేడి బురదతో పాటు నీరు, వాయువు (మట్టి) బురద అగ్నిపర్వతాల నుంచి సల్ఫర్, జింక్, మెగ్నీషియమ్ తదితర మినరల్స్ బయటకు పొంగుకొస్తాయి. 86 శాతం మీథేన్ వాయువు, కొద్ది మొత్తంలో కార్బన్ డయాక్సైడ్-నత్రజని ఉంటాయి. అయినప్పటికి మనుషులకు ఏలాంటి ప్రమాదం ఉండదు.
ఈ అగ్నిపర్వతాల్లో స్నానాలు చేయొచ్చు..!
అజర్ బైజాన్ దానికి ఆనుకుని ఉన్న కాస్పియన్ తీరంలో ఇలాంటి అగ్నిపర్వతాలు అధికంగా కనిపిస్తాయి. సాధారణంగా అగ్నిపర్వతాలు పేలితే ఎక్కడైనా భగభగ మండే లావా పొంగుకొస్తుంది. భారీ ఎత్తున మంటలు, కి.మీ ఎత్తుక బూడిద, ఎగసిపడతాయి. కానీ ఇక్కడి వోల్కనో పేలితే మాత్రం బురద పొంగుకొస్తుంది. అవి పొంగే సమయంలో తక్కువ ఉష్ణోగ్రతతో పొంగుతాయి. దీంతో ప్రర్యటకులను తేగ ఆకర్షిస్తున్నాయి. ఈ బురద అగ్నిపర్వతాల్లోకి దిగి స్నాన్నాలు కూడా చేస్తున్నారు. ఈ బురద మట్టి ఔషదాల గని. అందుకే బురద అగ్నిపర్వతాల్లో స్నానాలు ఫేమస్. వీటిని చూసే టూరిస్టులు కూడా ఎక్కువే. స్నానాలు చేసే టూరిస్టులు అంతకు ఎక్కువే.
భారతదేశంలో బురద అగ్నిపర్వతాలు..ఎక్కడ..?
ఇలాంటి మట్టి అగ్నిపర్వతాలు ప్రపంచంలో అనేక దేశాలలో కనిపిస్తాయి. ముఖ్యంగా మన దేశంలో అండమాన్ -నికోబార్ ద్వీపంలో ఇవి కనిపిస్తాయి. ప్రపంచ నలుమూలల నుంచి వీటిని చూసేందుకు నికోబార్ ద్వీపం తరలి వస్తారు. “ల్యాండ్ ఆఫ్ ఫైర్” గా పేరుతెచ్చుకుంది.
S.SURESH