Sonakshi Sinha : సింపుల్గా సోనాక్షి సిన్హా , జహీర్ పెళ్లి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను బ్యూటీ పెళ్లాడింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. బాయ్ ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్ ను బ్యూటీ పెళ్లాడింది. బాంద్రాలోని శత్రుఘ్న సిన్హా నివాసంలో కొద్దిమంది బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.
పెళ్లి సమయంలో సోనాక్షి తెలుపురంగు చికంకారి ఎంబ్రాయిడరీ చీర ధరించింది. అటు వరుడు జహీర్ ఇక్బాల్ కూడా సింపుల్ దుస్తులే ధరించాడు. వీళ్ల పెళ్లి హిందూ సంప్రదాయంలో జరుగుతుందా.. ముస్లిం పద్ధతిలో జరుగుతుందా.. అనే చర్చ జరిగింది. అయితే.. వీరు రిజిష్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. అధికారుల సమక్షంలో సోనాక్షి-ఇక్బాల్ ఇద్దరూ సంతకాలు చేసి పెళ్లి తంతు పూర్తి చేశారు.
వెడ్డింగ్ ఫొటోలను సోనాక్షి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త దంపతులకు పలువురు బాలీవుడ్ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందజేశారు.
ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత సోనాక్షి వేసిన పోస్ట్ చూస్తుంటే గత ఏడేళ్ల నుంచి వీరి ప్రేమ బంధం కొనసాగుతూ వచ్చిందని అర్థం అవుతోంది. ఏడేళ్ల క్రితం ఇదే రోజున కలిశాం.. ఒకరినొకరం చూసుకున్నాం.. అదే రోజున ఫిక్స్ అయ్యాం.. ఆ ప్రేమే మాకు దిక్సూచిలా మారింది.. నడిపించింది.. ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా ప్రేమే తోడుగా నిలిచింది.. మా ఇరు కుటుంబాల ప్రేమ, ఆశీర్వాదాలతో ఒక్కటయ్యాం.. మేం ఇప్పుడు భార్యాభర్తలం.. అంటూ ఇద్దరూ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత ఇద్దరూ తమ స్నేహితులు,కుటుంబ సభ్యుల కోసం గ్రాండ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ గ్రాండ్ రిసెప్షన్లో, బాలీవుడ్ తారలు కొత్త జంటను ఆశీర్వదించేందుకు తరలి వచ్చారు.