SINGER MANGLI: ఫోక్ రాణికి మరో అరుదైన గౌరవం.. మీ ప్రేమకు ధన్యవాదాలంటూ మంగ్లీ పోస్ట్

తాజాగా మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దీనికి సంబంధించి మంగ్లీ చేసిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగర్ మంగ్లీ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు, రివార్డులు గెల్చుకుంది. ఈ క్రమంలోనే మంగ్లీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 30, 2024 | 12:10 PMLast Updated on: Apr 30, 2024 | 12:10 PM

Singer Mangli Received Prestegious Honor From Times Powe Women 2024

SINGER MANGLI: సింగర్ మంగ్లీ.. బుల్లితైరపై తనదైన యాస, పాటలతో తెగులు ప్రేక్షకుల మనసు దోచిన ఈ గాయని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు రివార్డులు గెలుచుకున్న ఈ స్టార్ సింగర్‌కు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానముంది. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. ఓ ప్రముఖ ఛానల్ ద్వారా తెలుగు రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరైంది. అప్పటి వరకు సత్యవతి రాథోడ్‌గా ఉన్న ఆమె పేరు ఆ ఛానల్ ద్వారా మంగ్లీగా మారింది.

AP Politics : రఘురామను వెంటాడుతున్న శివరామరాజు.. ఉండిలో సంచలనం ఖాయమా…

ఈ పేరుతో మంగ్లీ విపరీతమైన క్రేజ్ సంపాదించింది. తన యాస, పాటల ద్వారా తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది. ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మ పాటలు ఇతర ఫోక్స్ సాంగ్స్‌తో మంగ్లీ తనకంటూ ఓ ప్రత్యేకమైన జోనర్ సంపాదించుకుంది. ఈ జోనర్‌లో మంగ్లీ తనదైన శైలిలో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. ఆమె పాడిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. తాజాగా మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. దీనికి సంబంధించి మంగ్లీ చేసిన ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగర్ మంగ్లీ ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు, రివార్డులు గెల్చుకుంది. ఈ క్రమంలోనే మంగ్లీ మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ది టైమ్స్ పవర్ ఉమెన్ 2024 పేరుతో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న పలువురు ప్రముఖ మహిళా మణులతో పాటు మంగ్లీని కూడా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఐఏఎస్ స్మితా సబర్వాల్, మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, మహిళా దర్శకురాలు నందినీ రెడ్డి, ప్రముఖ హీరోయిన్ టబు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

టైమ్స్ పవర్ ఉమెన్ 2024 టైటిల్‌ తో టైమ్స్ ఆఫ్‌ ఇండియాలో ప్రచురితమైన పేపర్‌ కటింగ్‌ను యాడ్ చేసిన మంగ్లీ.. ఇంత గొప్ప గౌరవం లభించడం తనకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోందంటూ పోస్ట్ చేసింది. తన ప్రయత్నాలన్నింటిలో తమ ప్రేమ, మద్దతు చూపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. కాగా.. మంగ్లీ ఎస్‌వీ విశ్వవిద్యాలయం నుంచి కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. సింగర్‌గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతున్న మంగ్లీ మరోవైపు బుల్లితెరపై యాంకర్‌గా కూడా కొనసాగుతుంది. చిన్నప్పటి నుంచి సింగర్‌గా ఎదగాలనే ఆమె కోరికను తండ్రి, ఉపాధ్యాయులు ఎంతగానో ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతోనే కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసి మంచి సింగర్ గా ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఫోక్ సాంగ్ అంటే వెంటనే మంగ్లీ గుర్తుకు వచ్చేలా క్రేజ్ సంపాదించింది. మంగ్లీ సాధించిన విజయాలను చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. ముందు ముందు ఆమె మరిన్ని అవార్డులు, పురస్కారాలు అందుకోవాలని మనసారా కోరుకుంటున్నారు.