MANGLI ACCIDENT : సింగర్ మంగ్లీకి.. తప్పిన ప్రమాదం
సింగర్ మంగ్లీ (Singer Mangli) ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును DCM వెహికిల్ ఢీకొట్టింది. ఈ ఈ ప్రమాదంలో కారులో ఉన్న మంగ్లీ (Mangli) తో సహా ముగ్గురు క్షేమంగా బయటపడినట్టుపోలీసులు చెప్పారు. శంషాబాద్ మండలం తొండుపల్లి దగ్గరల్లో శనివారం రాత్రి జరిగింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు.

Singer Mangli survived the accident. The car she was traveling in was hit by a DCM vehicle.
సింగర్ మంగ్లీ (Singer Mangli) ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారును DCM వెహికిల్ ఢీకొట్టింది. ఈ ఈ ప్రమాదంలో కారులో ఉన్న మంగ్లీ (Mangli) తో సహా ముగ్గురు క్షేమంగా బయటపడినట్టుపోలీసులు చెప్పారు. శంషాబాద్ మండలం తొండుపల్లి దగ్గరల్లో శనివారం రాత్రి జరిగింది. డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్మా శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ వెళ్ళింది. ఆ రోజు అర్థరాత్రి తర్వాత మేఘ్ రాజ్, మనోహర్ తో కలసి ఆమె హైదరాబాద్ – బెంగళూరు (Hyderabad – Bangalore) నేషనల్ హైవేపై ఇంటికి బయల్దేరింది. తొండుపల్లి బ్రిడ్జి దగ్గరకు రాగానే… కర్ణాటకకు చెందిన డీసీఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న మంగ్లీతో పాటు మిగతా ఇద్దరూ క్షేమంగా బయటపడినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో కారు వెనుక భాగం దెబ్బతింది. అలాగే కారు ఇండికేటర్ పగిలినట్టు పోలీసులు చెప్పారు. మంగ్లీ తీవ్రంగా గాయపడిందనీ… హాస్పిటల్ లో చేరిందని వస్తున్న వార్తల్లో నిజం లేదంటున్నారు పోలీసులు. ఎలాంటి ఆందోళన పడాల్సిల్సిన పనిలేదని చెబుతున్నారు. కానీ మంగ్లీ అభిమానులు మాత్రం ఫోన్ చేసి… ఆమెకు ఎలా ఉందని తెలుసుకుంటున్నారు.