Singer Mangli : సింగర్ మంగ్లీ.. ఇప్పుడెలా ఉందంటే
టీవీ షోల (TV shows) నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాల్లో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ.

Singer Mangli, who started her singing journey from TV shows, has now become the most wanted singer by singing in movies.
టీవీ షోల (TV shows) నుంచి మొదలైన పాటల ప్రయాణం నేడు సినిమాల్లో పాడుతూ మోస్ట్ వాంటెడ్ సింగర్ గా మారిపోయింది గాయని మంగ్లీ. తన గాత్రంతో శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుంది. అది ఫోక్ సాంగ్ అయినా సరే.. ఐటెం సాంగ్ (Item Song) ఐనా సరే మంగ్లీ పాడిందంటే చాలు ప్రేక్షకుల కేరింతలతో థియేటర్లు ఊగిపోవాల్సిందే. సింగర్ గా మారిన అనతి కాలంలోనే పాపులర్ గాయనిగా మారిపోయింది. వరుస అవకాశాలతో సినిమా రంగంలో దూసుకెళ్తున్న మంగ్లీ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్-బెంగళూరు (Hyderabad – Bangalore) రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద మంగ్లీ కారును డీసీఎం వ్యాన్ ఢీ కొట్టింది. వెనకాల నుండి వస్తున్న డిసియం ఢీ కొట్టడంతో.. మంగ్లీ కారు వెనుక భాగం స్వల్ప డ్యామేజ్ అయింది. ప్రమాద సమయంలో కారులో మగ్లితోపాటు డ్రైవర్ మేగరాజు, మనోహర్ లు ఉన్నారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత అదే కారులో మంగ్లీ ఇంటికి వెళ్ళిపోయింది. కాగా, డీసీఎం డ్రైవర్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సింగర్ మంగ్లీ (Singer Mangli) రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్త తెలుసుకున్న అభిమానులు టెన్షన్ పడ్డారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదని తనకేం కాలేదని మంగ్లీ తనకు సన్నిహిత మీడియా మిత్రులతో చెప్పినట్లుగా తెలుస్తోంది. మంగ్లీకి ఎలాంటి ప్రమాదం జరగలేదన్న విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.