Whats App: వాట్సప్ నుంచి అదిరిపోయే డ్యూయల్ యాక్సెసింగ్ ఫీచర్
వాట్సాప్ ఈ యాప్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈ యాప్ లేని స్మాట్ ఫోన్ అంటూ ఉండదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ ని 2.2 బిలియన్లకు పైగా క్రియాశీలకంగా వినియోగిస్తున్నారు. ఒకరికొకరు మెసేజింగ్, ఫోటోస్, కాల్స్, వీడియో కాల్స్, డాక్యుమెంట్ పంపించుకోవడం, లొకేషన్‌ను షేర్ చేయడానికి వాట్స్ యాప్ వినియోగించుకుంటారు. కాబట్టే వాట్సాప్‌కు అంత క్రేజ్ ఉంది. తాజాగా ఈ యాప్ సరికొత్త ఫీచర్ తో అందుబాటులోకి వచ్చింది. దీనిపై ఒక లుక్ వేయండి.
సాధారణంగా గతంలో ఒక మెబైల్ లో ఒక వాట్సప్ నే వినియోగించుకునే వారు. డ్యూయల్ సిమ్ టెక్నాలజీ వచ్చాక ఒకే స్మార్ట్ ఫోన్లో రెండు వాట్సప్ లను వినియోగిస్తున్నారు. అందులో ఒకటి సాధారణ ఇన్స్టలేషన్ అయితే మరోకటి క్లోన్డ్ ఇన్స్టలైజేషన్. మొదటిది సమస్యలేకున్నా.. రెండవదానివల్ల భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా మంది వ్యక్తిగత, వృత్తి రిత్యా తమతమ ప్రయోజనాల కోసం ఒకే ఫోన్‌ను ఉపయోగించినప్పటికీ వేర్వేరు సిమ్ కార్డ్‌లను మైంటైన్ చేస్తున్నారు. ఇలా వేర్వేరు సిమ్ కార్డులకు వాట్సాప్ ని ఒకే ఫోన్ లో క్రియేట్ చేయలేము. ఇప్పటి వరకు వాట్సాప్ ఫీచర్ లో మీరు అధికారికంగా ఒక ఫోన్ లో ఒక్క అకౌంట్ మాత్రమే ఉపయోగించుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు వచ్చిన సరికొత్త ఈ ఫీచర్ తో ఒక ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ఇకపై యూజర్లు ఒకే యాప్‌లో రెండు వాట్సాప్ అకౌంట్స్‌ను అధికారికంగా యాక్సెస్ తీసుకోవచ్చు. ఇంతవరకు వాట్సాప్ యాజమాన్యం ఇటువంటి ఫీచర్ను అందుబాటులోకి తీసుకురాలేదు కానీ.. ఇతర క్లోన్డ్ వాట్సాప్ ద్వారా తమ వ్యక్తిగత సమాచారం, భద్రతా పరమైన అంశాలకు భంగం వాటిల్లుతుంది. అందువల్ల లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నేరుగా వాట్సాప్ యాజమాన్యం ఆ సమస్యలన్నిటికీ చెక్ పెడుతూ ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకోచ్చింది. వాట్సాప్ అకౌంట్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ వద్ద ఉన్న బాణం గుర్తుసాయంతో మరో అకౌంట్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఖాతాకు మారవచ్చు. అప్పుడు యూజర్స్ ఒకే ఫోన్లో వేర్వేరు నంబర్లతో వాట్సాప్ ఖాతాలను నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలోనే డ్యూయల్ సిమ్ వాడే వారందరికి అందుబాటులోకి రానుంది.
S. SURESH