సిరాజ్ బెయిల్స్ ట్రిక్, ట్రాప్ లో పడిన లబూషేన్
క్రికెట్ లో అప్పుడప్పుడూ సెంటిమెంట్లు కూడా పనిచేస్తాయి... వికెట్ కోసం బెయిల్స్ స్విచ్ చేయడం క్రికెట్ లో ఒక ట్రిక్ గా వస్తోంది.. సరిగ్గా ఈ సెంటిమెంట్ తోనే సిరాజ్ ఆసీస్ బ్యాటర్ లబూషేన్ ను ట్రాప్ లో పడేశాడు. అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఔట్ అయ్యేలా చేశాడు.
క్రికెట్ లో అప్పుడప్పుడూ సెంటిమెంట్లు కూడా పనిచేస్తాయి… వికెట్ కోసం బెయిల్స్ స్విచ్ చేయడం క్రికెట్ లో ఒక ట్రిక్ గా వస్తోంది.. సరిగ్గా ఈ సెంటిమెంట్ తోనే సిరాజ్ ఆసీస్ బ్యాటర్ లబూషేన్ ను ట్రాప్ లో పడేశాడు. అతని ఏకాగ్రతను దెబ్బతీసి ఔట్ అయ్యేలా చేశాడు. రెండో రోజు ఆటలో లబుసేన్- మహ్మద్ సిరాజ్ మధ్య ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 32వ ఓవర్ రెండో బంతి అనంతరం సిరాజ్ స్ట్రైకర్ ఎండ్‌కు వెళ్లి బెయిల్స్‌ను మార్చాడు. సిరాజ్ వెళ్లిన అనంతరం స్ట్రైకింగ్‌లో ఉన్న లబుషేన్ బెయిల్స్‌ను తిరిగి మార్చాడు. కాగా, లబుషేన్ తర్వాతి ఓవర్‌లోనే ఔట్ అయ్యాడు. సిరాజ్ ఓవర్ ముగిసిన తర్వాత బంతిని అందుకున్న నితీశ్ రెడ్డి లబుషేన్‌ను బోల్తా కొట్టించాడు. షాట్‌కు యత్నించిన ఆసీస్ బ్యాటర్ స్లిప్‌లో ఉన్న విరాట్ కోహ్లి చేతికి చిక్కాడు.
నిజానికి లబుషేన్ మరో వికెట్ పడకుండా ఏకాగ్రతతో జాగ్రత్తగా ఆడుతున్నాడు. సిరాజ్ చేసిన పనికి అతను కాస్త ఇబ్బందిపడటంతో ఏకాగ్రత కోల్పోయి ఆ తరువాత ఓవర్లోనే అవుట్ అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. సిరాజ్ ట్రిక్ సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోవైపు లబూషేన్ పై ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ ఫైర్ అయ్యాడు. సిరాజ్ చేసిన దానికి స్పందించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించాడు.అప్పటి వరకూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా 55 బాల్స్ ఆడిన లబూషేన్ ఎప్పుడైతే బెయిల్స్‌ను మార్చాడో ఏకాగ్రత కోల్పోయాడన్నాడు. తాను గనుక క్రీజ్‌లో ఉండుంటే బౌలర్ అలా చేసినా పట్టించుకొనేవాడిని కాదన్నాడు. మొత్తం మీద సిరాజ్ బెయిల్స్ స్విచ్ ట్రిక్ పనిచేసి లబుషేన్ వికెట్ ఇచ్చుకున్నాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.