సిరాజ్ వర్సెస్ ఆస్ట్రేలియా, మియా భాయ్ దూకుడు
స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంగారూలకు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అదే రీతిలో సమాధానమిస్తున్నాడు. పింక్ బాల్ టెస్టులో ప్రస్తుతం సిరాజ్ హాట్ టాపిక్ గా మారాడు. 4 వికెట్లతో ఆసీస్ ను దెబ్బకొట్టిన మియా భాయ్ ఆసీస్ బ్యాటర్లను పలుమార్లు కవ్వించాడు.
స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కంగారూలకు హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ అదే రీతిలో సమాధానమిస్తున్నాడు. పింక్ బాల్ టెస్టులో ప్రస్తుతం సిరాజ్ హాట్ టాపిక్ గా మారాడు. 4 వికెట్లతో ఆసీస్ ను దెబ్బకొట్టిన మియా భాయ్ ఆసీస్ బ్యాటర్లను పలుమార్లు కవ్వించాడు. భారత బ్యాటింగ్ సమయంలో ఆసీస్ బౌలర్లు దూకుడుగా సంబరాలు చేసుకుంటూ.. నోటికి పనిచెప్పారు. భారత బౌలర్లు కూడా అదే తరహాలో స్లెడ్జింగ్ చేస్తూ ఆసీస్ బ్యాటర్లను కవ్విస్తున్నారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్, విరాట్ కోహ్లీ దూకుడుగా వ్యవహరిస్తూ.. ఈ సిరీస్‌పై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన ట్రావిస్ హెడ్‌ను సిరాజ్ స్టన్నింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందే ట్రావిస్ హెడ్ సిక్స్ కొట్టడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న సిరాజ్.. వికెట్ తీసి గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. సిరాజ్ సంబరాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రావిస్ హెడ్.. తన నోటికి పని చెప్పాడు.
సిరాజ్ వెంటనే పెవిలియన్ పో అన్న రీతిలో సైగ చేశాడు. దాంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ట్రావిస్ హెడ్‌కు సిరాజ్ సెండాఫ్ ఇవ్వడంపై ఆసీస్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. సిరాజ్‌ను ఎగతాళి చేస్తూ గట్టిగా కామెంట్ చేశారు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సిరాజ్ మాత్రం తన బౌలింగ్‌తోనే అభిమానులకు బదులిచ్చాడు. ఈ మ్యాచ్ లో 141 బంతులు ఎదుర్కొన్న ట్రావిస్ హెడ్ 140 పరుగులు చేశాడు. 17 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. కాగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. ఇదిలా ఉంటే తొలిరోజు కూడా సిరాజ్ వార్తల్లో నిలిచాడు. ఆసీస్ బ్యాటర్ లబూషేన్ పైకి కోపంతో బంతిని విసిరాడు. ఇన్నింగ్స్ 25వ ఓవర్ లో ఈ ఘటన జరిగింది. రనప్ తీసుకుని బంతి వేసేందుకు వస్తున్న సిరాజ్ ను ఆగమంటూ లబూషేన్ సైగ చేయడంతో సహనం కోల్పోయిన హైదరాబాదీ పేసర్ వికెట్ల పైకి బాల్ విసిరాడు. ఆసీస్ కవ్వింపు చర్యలకు సిరాజ్ ధీటుగానే బదులిచ్చాడంటూ భారత్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతుంటే.. ఆసీస్ మీడియా మాత్రం ఓవరాక్షన్ చేస్తోంది.
సిరాజ్ దూకుడు తగ్గించుకోవాలంటూ మీడియా కథనాల్లో హైలెట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ లో సిరాజ్ బంతితోనూ అదరగొట్టాడు. 4 కీలక వికెట్లతో ఆసీస్ ను దెబ్బతీశాడు. అటు బూమ్రా కూడా 4 వికెట్లు తీయగా… తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం దక్కింది.