Ayodhya Seethamma : అయోధ్యలో సీతమ్మకు సిరిసిల్ల చీర..
తెలంగాణ నుంచి అయోధ్య రాముడికి వరుస కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ద్వారాలు, పాదుకలు, భారీ లడ్డూ, ముత్యాలు కానుకగా వెళ్లగా ఇప్పుడు మరో కానుక రాముడి పాదాల చెంతకు చేరబోతోంది. నేతనల్ల పుట్టినిల్లు సిరిసిల్ల నుంచి బంగారంతో నేసిన చీరను రామాలయానికి కానుకగా పంపనున్నారు.
తెలంగాణ నుంచి అయోధ్య రాముడికి వరుస కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ద్వారాలు, పాదుకలు, భారీ లడ్డూ, ముత్యాలు కానుకగా వెళ్లగా ఇప్పుడు మరో కానుక రాముడి పాదాల చెంతకు చేరబోతోంది. నేతనల్ల పుట్టినిల్లు సిరిసిల్ల నుంచి బంగారంతో నేసిన చీరను రామాలయానికి కానుకగా పంపనున్నారు. సిరిసిల్ల (Sirisilla) నేతన్న హరిప్రసాద్ (Hariprasad) తన స్వయంగా తయారు చేసిన బంగారు చీరను.. జనవరి 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందించనున్నారు. ప్రధాని చేతుల మీదుగా రాముడి పాదాల చెంత చీరను ఉంచనున్నారు.
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ (Karimnagar MP) బండి సంజయ్ (Bandi Sanjay) సిరిసిల్లలోని హరిప్రసాద్ ఇంటికి వెళ్లారు. హరిప్రసాద్ తయారు చేసిన బంగారు చీరను పరిశీలించారు. శ్రీరాముడి చిత్రంతోపాటు రామాయణ ఈతివృత్తాన్ని తెలియజేసే చిత్రాలను కూడా ఆ చీరలో పొందుపర్చారు హరిప్రసాద్. 8 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండితో తయారు చేసిన చీర అందరినీ ఆకట్టుకుంటోంది. చీరను చూసి ఎంతో సంతోషించిన బండి సంజయ్ హరిప్రసాద్‌ను శాలువాతో సత్కరించారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ (RamMandirPranPratishta) సందర్భంగా సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ స్వయంగా తన చేతులతో తయారు చేసిన బంగారు చీర చాలా బాగుందన్నారు.
జనవరి 26న ప్రధాని మోడీకి చీరను (Sari) అందించనున్నారని.. ప్రధాని చేతుల మీదుగా శ్రీరాముడి పాదాల చెంతకు చేరుతుందన్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన చరిత్ర సిరిసిల్లదని.. ఇంతటి గొప్ప నైపుణ్యాన్ని సొంతం చేసుకున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు బండి సంజయ్.