బ్రేకింగ్: లడ్డు లడాయిపై సిట్ విచారణ స్టార్ట్

తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ విచారణ నేటి నుంచి మొదలుకానుంది. ఇటీవల గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 28, 2024 | 03:27 PMLast Updated on: Sep 28, 2024 | 3:27 PM

Sit Enquiry Starts About Tirumala Laddu Issue

తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ విచారణ నేటి నుంచి మొదలుకానుంది. ఇటీవల గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాసేపటి క్రితమే సిట్ బృందం తిరుమల చేరుకుంది. పద్మావతి గెస్ట్ హౌస్ కు సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి చేరుకున్నారు. మూడు రోజుల పాటు తిరుమలలో బృందం ఉంటుంది.

మొదట తిరుపతి ఈస్ట్ స్టేషన్ కు వెళ్లి అక్కడ నమోదైన 470/2024 కేసు వివరాలను సిట్ సేకరిస్తుంది. అనంతరం లడ్డు తయారీ లో పాల్గొన్న వారితో పాటు అక్కడ విధులు నిర్వర్తించే సిబ్బంది, ముడిసరుకుల కేంద్రం, టెస్టింగ్ లాబ్ సిబ్బంది ని కలసి విచారణ సిట్ విచారణ చేస్తుంది. తిరుమలతో పాటు తమిళనాడు లోని దిండుక్కల్ లో ఏ ఆర్ డెయిరీ ప్లాంట్ ను సిట్ సందర్శిస్తుంది.