Tollywood Movies: ఆ డేట్ లో దోషం
సెప్టెంబర్ 15న విడుదలకు సిద్దమైన సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. దీనికి కారణాలు ఇవే.
సెప్టెంబర్ 15 అంటేనే ఇండస్ట్రీ వణికే పరిస్తితి వచ్చినట్టుంది. అప్పట్లో ఇంటినెంబర్ 13 అంటే భయపడ్డారు. విదేశాల్లో ఆ నెంబర్ అంటే దెయ్యాన్ని చూసినట్టు ఎలా భయపడుతారో, ఆ నెంబర్ తోవచ్చిన మూవీలకి అలానే భయపడతారు. అచ్చంగా అలాంటి నెంబర్ గా సెప్టెంబర్ 15 మారుతోందా?
ఎందుకంటే ఈ నెల 15 న స్కంద మూవీ రావాలి. కాని సలార్ వాయిదా పడిందని, ఆ రోజుని వాడుకునేందుకు స్కంద టీం 28 కి రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకుంది. దీంతో 15 వ తేదీన తెలుగు తెరమీద చంద్రముఖి 2, మార్క్ ఆంటోనీ అంటూ రెండు డబ్బింగ్ సినిమాల సందడే అన్నారు.
కట్ చేస్తే, రాఘవ లారెన్స్, కంగనా కలిసి చేసిన చంద్రముఖి 2 గ్రాఫిక్స్ డిలే అని విడుదలతేదీని 28 కి మార్చుకున్నారు. సరే చంద్రముఖి 2 రాకపోతే మార్క్ ఆంటోనీ సోలోగా సందడి చేస్తాడనుకుంటే, చెన్నై కోర్టు ఆ సినిమానే బ్యాన్ చేసింది. లైకా ప్రొడక్షన్స్ కి 15 కోట్లు బాకీ పడ్డ విశాల్ ఆ అప్పు తీర్చకపోవటంతో మార్క్ ఆంటోనీ రిలీజ్ ని ఆపేసింది కోర్టు. దీంతో 15న తెలుగుమూవీలే కాదు, తమిళ సినిమాలు కూడా వచ్చేలా లేవు.
అదేంటో మరో డేట్ నచ్చి మిగతా సినిమాలు వాయిదా పడ్డాయంటే యాదృచ్చికం అనుకోవచ్చు. కాని 15 న రావాల్సిన మార్క్ ఆంటోనీ మీద బ్యాన్ వేయటం చూస్తే సెంటిమెంటల్ గా ఆరోజు అంటే సినీజనం భయపడాల్సి వస్తోంది. అసలే సెంటిమెంట్స్ ఎక్కువ ఫాలో అయ్యే దర్శక నిర్మాతలు ఈ వారం పోటీ లేకున్నా సినిమాలేవీ రిలీజ్ చేసేందుకు సిద్ద పడట్లేదట.