Smita Sabharwal : స్మితకు ఎందుకొచ్చిన గొడవ
కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన IAS అధికారి స్మిత సబర్వాల్ ప్రస్తుతం లూప్ లైన్ పోస్టులో ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నాం కదా... మన పని మనం చేసుకుంటూ... ఇంత జీతం తీసుకుంటూ.... మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ కాలం గడపొచ్చు కదా... కానీ ఖాళీ చెయ్యి ఊరుకోదు అంటారు.
కేసీఆర్ హయాంలో ఓ వెలుగు వెలిగిన IAS అధికారి స్మిత సబర్వాల్ ప్రస్తుతం లూప్ లైన్ పోస్టులో ఉన్నారు. ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నాం కదా… మన పని మనం చేసుకుంటూ… ఇంత జీతం తీసుకుంటూ…. మధ్య మధ్యలో రీల్స్ చేసుకుంటూ కాలం గడపొచ్చు కదా… కానీ ఖాళీ చెయ్యి ఊరుకోదు అంటారు. ట్విట్టర్లో అనవసరంగా దివ్యాంగులపై వివాదస్పద ట్వీట్ చేసి ఇప్పుడు లేనిపోని కష్టాలను నెత్తికెత్తుకుంది.
దివ్యాంగులు IAS ఉద్యోగాలకు పనికిరారు అంటూ Xలో కామెంట్ చేసిన IAS అధికారి స్మిత సబర్వాల్ అనవసర వివాదంలో తలదూర్చారు. గతంలో కేసీఆర్ దగ్గర CMO లో అన్నీ శాఖలు నావే అన్నట్టుగా దర్జా వెలగబెట్టారు. జిల్లాల్లో సమీక్షలకు హెలికాప్టర్లు వేసుకొని వెళ్ళారు. దేశంలో నిత్యం హెలికాప్టర్లలో తిరిగే IAS అధికారిగా స్మిత సబర్వాల్ ని అప్పట్లో చెప్పుకునేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక… ఆమెను లూప్ లైన్ పోస్టులో పడేశారు. దాంతో స్మిత సబర్వాల్ కి పెద్దగా పనిలేదు. అలాగని… తనకు ఎప్పటి నుంచో అలవాటున్న రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవచ్చు కదా… ట్విట్టర్లో దివ్యాంగల మీద తల తిక్క ట్వీట్ చేసి.. లేని పోని వివాదాన్ని మెడకు చుట్టుకున్నారు.
అందంగా ఉంటేనే ఐఏఎస్ అధికారి అవ్వాలా… పదేళ్ళు CMO లో ఏం వెలగబెట్టావో అందరికీ తెలుసు… ఇప్పుడు మా మీద నీ జులుం ఏంటి అంటూ దివ్యాంగులు స్మిత సబర్వాల్ పై మండిపడుతున్నారు. NHRC తో పాటు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు కూడా ఆమెపై కంప్లయింట్ వెళ్ళింది. స్మితను ఉద్యోగానికి రాజీనామా చేయమనీ… మళ్ళీ సివిల్స్ రాద్దాం… ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామని సివిల్స్ కోచింగ్ ఫ్యాకల్టీ బాల లత సవాల్ చేశారు. అప్పటికైనా చూసీ చూడనట్టు వదిలేయొచ్చు కదా… దానికీ రిప్లయి ఇచ్చారు స్మిత సబర్వాల్. రిజైన్ చేయడానికి నేను రెడీ… నా ఏజ్ బార్ అయింది కదా.. ఇప్పుడు రాయలేనని సమాధానం చెప్పింది. ఆమె ట్విట్స్ పై మంత్రి సీతక్కతో పాటు మొన్నటిదాకా ఎవరి దగ్గరైతే కొలువు చేసిందో… ఆ BRS మాజీ మంత్రులు హరీష్ రావు కూడా ఆమె వైఖరిని తప్పుబట్టారు. ఐఏఎస్ అధికారులు కూడా స్మిత ట్వీట్స్ పై మండిపడుతున్నారు. రాజ్యాంగం అంటే లెక్కలేకుండా ఏంటా కామెంట్స్ .. వైకల్యంతో బాధపడే వారిని గౌరవించాలన్న సోయి లేదా అని మండిపడుతోంది ఐఏఎస్ ల సంఘం . సివిల్ సర్వీసెస్ అధికారి అంటేనే… సమాజంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ… అందర్నీ కలుపుకుపోతూ పనిచేయాలి. కానీ అవేమీ లేకుండా దివ్యాంగులపై చెత్త ట్వీట్స్ చేస్తూ అనవసర వివాదాల్లో తలదూర్చి అభాసుపాలైంది స్మిత సబర్వాల్. కానీ తాను పనిచేస్తోంది కేసీఆర్ హయాంలో కాదనీ… 10యేళ్ళ భ్రమ నుంచి బయటపడాలని నెటిజెన్స్… స్మిత సబర్వాల్ పై మండిపడుతున్నారు. అప్పట్లో లాగా పెత్తనం చేస్తామంటే కుదరదని అంటున్నారు.