Smita Sabharwal: స్మితకు కష్టాలే! స్మిత సబర్వాల్ మెడకు.. భగీరథ పైపుల స్కామ్

మిషన్ భగరీథలో 7 వేల కోట్ల దాకా స్కామ్ జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. అయితే సీఎంఓలో పనిచేస్తూ, ఈ శాఖను పర్యవేక్షించిన IAS అధికారి స్మితా సబర్వాల్ పాత్ర పైనా ఎంక్వైరీ చేస్తోంది. మిషన్ భగీరథలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 7, 2024 | 01:56 PMLast Updated on: Feb 07, 2024 | 5:40 PM

Smita Sabharwal In Mission Bhageeratha Scheme Corruption

Smita Sabharwal: తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. కాళేశ్వరం, మేడిగడ్డ, విద్యుత్ ఒప్పందాలు లాంటి వాటిపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు మిషన్ భగీరథ మీద ఫోకస్ పెట్టింది. పైప్ లైన్లు లేకుండా.. నల్లాలు బిగించకుండా.. ఓవర్ హెడ్ ట్యాంక్స్ నిర్మించకుండానే.. ఆ పనులు చేసినట్టుగా కోట్ల రూపాయలు విత్ డ్రా చేశారు కొందరు అధికారులు, కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు. మిషన్ భగరీథలో 7 వేల కోట్ల దాకా స్కామ్ జరిగినట్టు ప్రభుత్వం భావిస్తోంది. అయితే సీఎంఓలో పనిచేస్తూ, ఈ శాఖను పర్యవేక్షించిన IAS అధికారి స్మితా సబర్వాల్ పాత్ర పైనా ఎంక్వైరీ చేస్తోంది.

HMDA Siva Balakrishna : కోడ్ కి ముందు 90 ఫైల్స్ క్లియర్.. విల్లాలు, ఫ్లాట్స్ అడ్డగోలు అనుమతి

మిషన్ భగీరథలో భారీగా అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. గ్రామాల మధ్య వేసిన పైప్ లైన్ల విషయంలో వేల కోట్లు స్కామ్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. భగీరథ స్కీమ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి డిసైడ్ అయ్యారు. మొత్తం స్కీమ్ 40 కోట్ల రూపాయలు అయితే. విజిలెన్స్ ఇన్నర్ గా జరిపిన విచారణలో దాదాపు 7వేల కోట్ల దాకా అవినీతి జరిగినట్టు బయటపడింది. దాంతో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మండలానికి ఒక గ్రామం చొప్పున అధికారులు విచారణ చేయబోతున్నారు. అసలు మిషన్ భగీరథకు ముందు ఆ గ్రామంలో తాగునీటి పథకం ఉందా.. కొత్తగా పైప్ లైన్లు వేశారా.. ఎంత మందికి కొత్త కనెన్షన్లు ఇచ్చారు.. ఇప్పుడు ఇంటింటికీ భగీరథ నీళ్ళు వస్తున్నాయా.. లాంటి అంశాలతో పాటు నిధుల దుర్వినియోగం మీద దృష్టి పెట్టనున్నారు అధికారులు. ఇంటింటికీ తాగునీటిని అందించే మిషన్ భగీరథ మంచి పథకమే. దీని స్ఫూర్తితో కేంద్రం కూడా ఈ స్కీమ్ చేపట్టింది.

కానీ మెటీరియల్ కొనకుండా ఫేక్ బిల్స్ పెట్టడం.. గ్రామాల్లోని వర్క్స్‌లో గోల్ మాల్ జరగడమే కాదు.. ఇప్పటికీ చాలా ఇళ్ళకు భగీరథ నీళ్ళు రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మిషన్ భగీరథకు 30 వేల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి.. అప్పులు తీసుకొని పనులు జరిపిస్తే.. పాత పైపులైన్లు, పాత ట్యాంకులను కొత్తగా చూపించి డబ్బులు నొక్కేయడంపై చాలా యేళ్ళుగా విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వెళ్ళినా.. మనోళ్ళేగా తిన్నది అన్నట్టుగా కేసీఆర్ సర్కార్ వదిలేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ హయాంలో CMO సెక్రటరీగా స్మిత సబర్వాల్ స్వయంగా ఈ మిషన్ భగీరథ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఈ పథకంలో ఏం జరిగిందన్నది ఆమెకు ఖచ్చితంగా తెలుసంటున్నారు. గ్రామాల్లో స్కీమ్స్ ని పర్యవేక్షించడానికి హెలికాప్టర్లు వేసుకొని మరీ వెళ్ళారు స్మితా సబర్వాల్. మిషన్ భగీరథ స్కీమ్ మొత్తాన్ని హైదరాబాద్ సెక్రటరియేట్ నుంచి మేనేజ్ చేసిన ఆమెకు ఈ స్కామ్ గురించి తెలియదా.. చేయని పనులకు బిల్లులు చెల్లించినట్టు తెలిస్తే స్మితా సబర్వాల్ ఏం చర్యలు తీసుకున్నారు. ఎవరికైనా నోటీసులు ఇచ్చారా? అన్నదానిపైనా విచారణ జరగనుంది.

ప్రభుత్వ పెద్దల హస్తం ఉండటంతో ఆమె ఏమీ చేయలేకపోవచ్చు. కానీ విజిలెన్స్ ఎంక్వైరీలో ఈ అక్రమాలు బయటపడితే… రేవంత్ రెడ్డి సర్కార్ మొదట చర్యలు తీసుకునేది స్మితా సబర్వాల్ పైనే అంటున్నారు. విజెలెన్స్ విచారణలో నిజా నిజాలు బయటకు రాకపోతే… మరింత లోతైన విచారణకు ఉన్నతస్థాయి ఎక్స్ పర్ట్స్ కమిటీని కూడా వేస్తారని తెలుస్తోంది.