Smita Sabharwal : రేవంత్ ను కలవని స్మితా సబర్వాల్.. అసలు కారణం అదేనా..
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత అధికారులు వరుసగా ఆయన కలిసేందుకు క్యూ కడుతున్నారు. కొందరు ఆయన ఇంటకి వెళ్లి కలుస్తుంటే.. కొందరు మాత్రం సెక్రటేరియట్‌లో కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎస్ శాంతి కుమారితో సహా.. దాదాపు అందరూ కొత్త సీఎంను కలిశారు. కానీ కీలక శాఖల్లో అత్యంత కీలకంగా పని చేసిన ఐఏఎస్ అధికారులు మాత్రం ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డిని కలవలేదు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత అధికారులు వరుసగా ఆయన కలిసేందుకు క్యూ కడుతున్నారు. కొందరు ఆయన ఇంటకి వెళ్లి కలుస్తుంటే.. కొందరు మాత్రం సెక్రటేరియట్‌లో కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సీఎస్ శాంతి కుమారితో సహా.. దాదాపు అందరూ కొత్త సీఎంను కలిశారు. కానీ కీలక శాఖల్లో అత్యంత కీలకంగా పని చేసిన ఐఏఎస్ అధికారులు మాత్రం ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డిని కలవలేదు. అందులో మాజీ సీఎం పర్సనల్ సెక్రెటరీల్లో ఒకరైన స్మితా సబర్వాల్ ఒకరు. ఇరిగేషన్ శాఖలో కీలక బాధ్యతలు చేపడుతున్న స్మితా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఒక్కసారి కూడా సీఎం రేవంత్‌ను కలవలేదు..
KTR : త్వరగా లేవండి నాన్న.. తండ్రిని తల్చుకుని KTR ఎమోషనల్ పోస్ట్..
గత ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన స్మితా.. ఇప్పుడు సీఎంకే దూరంగా ఉండటంలో ఆమె ట్రాన్స్‌ఫర్ కాబోతోంది అనే వాదన మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో స్మిత మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఐఏఎస్ అధికారిలా కాకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకురాలిలా స్మిత మాట్లాడుతోందంటూ అప్పట్లో చాలా మంది ఆరోపించారు. ఇప్పుడు సీఎంను స్మిత కలవకపోవడంతో అదే వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. కేవలం స్మిత మాత్రమే కాదు.. ఐటీ శాఖ్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న జయేష్‌రంజన్, అడిషనల్ చీఫ్ సెక్రెటరీగా ఉన్న అరవింద్‌కుమార్ ఐఏఎస్ కూడా ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డిని కలవలేదు. వీళ్లంతా గత ప్రభుత్వం హయాంలో సీఎంకు చాలా క్లోజ్‌గా ఉన్న అధికారులు. తమ ఉద్యోగానికి మించి కేసీఆర్‌కు వీళ్లు సహకరించారని వీళ్లపై ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో వీళ్లంతా రేవంత్ రెడ్డిని ఇప్పటి వరకూ కవలకపోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. త్వరలో వీళ్లంతా ట్రాన్స్‌ఫర్ మీద వెళ్లిపోయే అవకాశాలున్నాయంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.