Smita Sabharwal: రాజకీయాల్లోకి స్మితా సబర్వాల్..? ఏ పార్టీలోకి ఎంట్రీ..?
తన పర్సనల్ విషయాలను ఎన్నో ఇంటర్వ్యూలలో పంచుకున్నారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంపై వచ్చిన విమర్శలకు ఆమె ఆన్సర్ చెప్పారు. అలా కూర్చోవడం తన స్టయిల్ అన్నారు.

Smita Sabharwal: సీనియర్ IAS అధికారిణి స్మితా సబర్వాల్ త్వరలో రాజకీయాల్లోకి వస్తున్నారా..? ఎక్కడి నుంచి నిలబడతారు..? ఏ పార్టీ తరపున పోటీ చేస్తారు అన్నది ఇప్పుడు స్టేట్‌లో హాట్ టాపిక్ అయింది. ఈమధ్య ఓ ఇంటర్వ్యూలో స్మితా సబర్వాల్ చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. పాలిటిక్స్‌లోకి వెళతారా అన్న ప్రశ్నకు తాను భవిష్యత్తు ఊహించలేనంటూ సమాధానం దాటవేసే ప్రయత్నం చేశారు.
Mumps in kerala: కేరళలో పెరిగిపోతున్న గవద బిళ్లలు.. ఒక్క రోజే భారీ కేసులు నమోదు..!
కానీ రాజకీయాల్లోకి వెళ్ళను అని మాత్రం స్మితా సబర్వాల్ ఖచ్చితంగా చెప్పకపోవడంతో కొత్త చర్చకు దారితీస్తోంది. తాను రిటైర్డ్ అయ్యాక పాలిటిక్స్ విషయం ఆలోచిస్తానని చెప్పారామె. తన పర్సనల్ విషయాలను ఎన్నో ఇంటర్వ్యూలలో పంచుకున్నారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. మంత్రి సీతక్క ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడంపై వచ్చిన విమర్శలకు ఆమె ఆన్సర్ చెప్పారు. అలా కూర్చోవడం తన స్టయిల్ అన్నారు. తనపై వచ్చే విమర్శలకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వననీ.. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతానన్నారు స్మితా సబర్వాల్. ఒత్తిడి ఎదురైతే తన ఇంట్లో గార్డెన్ ఏరియాలోకి వెళ్ళి రిలీఫ్ పొందుతానని చెప్పారు. మెదక్ ప్రాంతంతో తనకు అనుబంధం ఎక్కువని అన్నారు స్మితా సబర్వాల్. ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సమయంలో అమరవీరుల కుటుంబ సభ్యులను ఓదార్చేటప్పుడు కంటతడి పెట్టుకోవడంపై స్పందించారు.
తాను ఎమోషనల్ అయ్యాయననీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తాను కూడా కోరుకున్నట్టు స్మిత చెప్పారు. చిన్నప్పుడు బ్యాడ్మింటన్, మ్యూజిక్, స్విమ్మింగ్ నేర్చుకున్నట్టు తెలిపారు. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి మాట్లాడిన స్మితా సబర్వాల్.. మంచి పనులు చేస్తే జనం ఆదరణ ఉంటుందని చెప్పారు.