స్మృతి మంధాన @ 4000, భారత ఓపెనర్ అరుదైన రికార్డ్

భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన కొత్త ఏడాదిలోనూ దుమ్మురేపుతోంది. సొంతగడ్డపై రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 11, 2025 | 03:51 PMLast Updated on: Jan 11, 2025 | 3:51 PM

Smriti Mandhana 4000 A Rare Record For An Indian Opener

భారత మహిళల జట్టు ఓపెనర్ స్మృతి మంధాన కొత్త ఏడాదిలోనూ దుమ్మురేపుతోంది. సొంతగడ్డపై రికార్డుల మోత మోగిస్తోంది. తాజాగా వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో స్మృతి మంధాన ఈ ఫీట్ సాధించింది. ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడిన స్మృతి మంధాన తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించింది. ఈ క్రమంలోనే వన్డే క్రికెట్‌లో 4 వేల పరుగులు పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 15వ ప్లేయర్‌గా, రెండో భారత క్రీడాకారిణిగా మంధాన నిలిచింది. స్మృతి మంధాన కంటే ముందు భారత్ తరఫున మిథాలీ రాజ్ ఈ మైలురాయి అందుకుంది. 95 ఇన్నింగ్స్‌ల్లోనే మంధాన ఈ రికార్డ్ సాధించింది. ఓవరాల్‌గా అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన మూడో ప్లేయర్‌గా.. తొలి భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కింది.