పాముని నోట్లో పెట్టుకుని వీడియో… చివరికి

పాముతో సెల్ఫీ దిగుతుండగా పాము కాటుకు గురై యువకుని మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలంలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఘటన జరిగింది. పాములు పట్టే మోచి శివరాజు పాముకాటుతో ప్రాణాలు కోల్పోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2024 | 12:11 PMLast Updated on: Sep 06, 2024 | 12:11 PM

Snake In Mouth Video Finally

పాముతో సెల్ఫీ దిగుతుండగా పాము కాటుకు గురై యువకుని మృతి చెందిన ఘటన బాన్సువాడ మండలంలో చోటు చేసుకుంది. బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో ఘటన జరిగింది. పాములు పట్టే మోచి శివరాజు పాముకాటుతో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మోచి గంగారం పాములు పడుతూ ఉంటాడు. అదే విద్యను తన కొడుకుకి నేర్పించారు. తండ్రి పామును పట్టి కొడుకుకు ఇవ్వగా సెల్ఫి కోసం ప్రయత్నించాడు శివరాజ్.

ఏకంగా నోట్లో పెట్టుకొని ఫోటోకు విడియోలకు ఫోజులు ఇచ్చాడు. వీడియో ను సోషల్ మీడియాలో వైరల్ చేయాలని యువకుడు అతి ఉత్సాహం పాముతో చెలగాటం ఆడాడు. శివ రాజులు మృతితో దేశాయిపేట్ గ్రామం పోచారం కాలనీలో విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.