Beer Hair Spa : బీర్ స్పా కోసం ఎగబడుతున్నారు! ఈ ట్రెండ్‌ పెరగడానికి కారణం ఏంటంటే?

బీర్‌ స్పా (Beer Spa). అంటే బీరుతో స్నానం చేయడం. వినేందుకు వింతగా ఉన్నా.. రోజు రోజుకూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రెండ్‌ ఇది. బీరు(Beer) ను ఎంతో ఇష్టంగా తాగే, తయారు చేసే చెక్‌ రిపబ్లిక్‌, ఆస్ట్రియా (Austria) దేశాల్లో మొదలైన ఈ ట్రెండ్‌.. ఇప్పడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 17, 2024 | 03:00 PMLast Updated on: Jun 17, 2024 | 3:00 PM

Soaring For A Beer Spa What Is The Reason For This Growing Trend

బీర్‌ స్పా (Beer Spa). అంటే బీరుతో స్నానం చేయడం. వినేందుకు వింతగా ఉన్నా.. రోజు రోజుకూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ట్రెండ్‌ ఇది. బీరు(Beer) ను ఎంతో ఇష్టంగా తాగే, తయారు చేసే చెక్‌ రిపబ్లిక్‌, ఆస్ట్రియా (Austria) దేశాల్లో మొదలైన ఈ ట్రెండ్‌.. ఇప్పడు ప్రపంచాన్ని చుట్టేస్తోంది. ఫ్యాక్టరీలో తయారనై ఫస్ట్‌ క్వాలిటీ బీరును ఈ స్పాకు ఉపయోగించడంతో దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఈ ట్రెండ్‌ ఇంత ఫాస్ట్‌గా పెరగడానికి ఇదే కారణం. వెల్‌నెస్‌లో ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు అత్యంత జనాదరణ పొందుతోంది. 2021 నుంచి ఈ ట్రెండ్‌ చాలా ఫాస్ట్‌గా పెరుగుతోంది.

అమెరికాతో పాటు చాలా దేశాల్లో ఇప్పటికే బీర్‌ స్పా సెంటర్లు (Beer Spa Centers) ఓపెన్‌ అయ్యాయి. రైతులు పొలంలో పండించిన బార్లీ నుంచి నేరుగా బీర్‌ తయారు చేయించుకుని స్పా ఎంజాయ్‌ చేస్తున్నారు. బీర్‌లో చర్మానికి మేలు చేసే మూడు పదార్థాలు ఉన్నాయి. అవి నానబెట్టిన ధాన్యాలు, ఈస్ట్, హాప్‌ అని పిలవబడే పువ్వులు. నానబెట్టిన ధాన్యాలు, ఈస్ట్ రెండింటిలో విటమిన్ బీ ఉంటుంది. ఇది చర్మం మీద మాయిస్చర్‌ను వాటర్‌ లెవెల్స్‌ను పెంచుతుంది. హైపర్‌ పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. హాప్స్‌లో కేన్సర్‌ను నిరోధించే యాంటీఆక్సైడ్స్‌ ఉంటాయి. చర్మంపై మంటను తగ్గించే ఇన్‌ఫ్లమేటరీస్‌ కూడా ఉంటాయి.

ఈ స్పాలో వాడే హ్యూములోన్‌ చర్మ సంబంధిత వైద్యానికి వాడే యాంటీ బాక్టీరియల్ సమ్మేళనం. హాప్.. డెడ్‌ స్కిన్‌ను తొలగించడంతో పాటు డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించడానికి పని చేస్తుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం నిద్రకోసం హాప్‌లను ఉపయోగించేవారట. దీనికి సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ కూడా ఉందని స్పా నిర్వహకులు చెప్తున్నారు. ఇలా బీర్‌ బాత్‌ చేయడం ద్వారా కండరాలు ఒత్తిడి నుంచి త్వరగా కోలుకుంటాయి. స్వేధ రంద్రాలు తెరుచుకుని చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ఈ బాత్‌ తరువాత గడ్డితో చేసిన ఓ బెడ్‌ దీమ పడుకోవాలి. దీని వళ్ల చర్మం మరింత కాంతివంతంగా తయారువుతుంది.

ఇప్పటికే మన దేశంలో చాలా మంది హెయిర్‌ స్పా కోసం బీర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ బాత్‌ స్పా కూడా నెమ్మదిగా విస్తరిస్తోంది. ఈ బీర్ స్నానం ఇప్పుడు కొత్త క్రియేట్‌ చేసింది కాదని చెప్తున్నారు స్పా నిర్వాహకులు. వేల ఏళ్ల నుంచి ఇలా మద్యంలో స్నానం చేసే ప్రక్రియ ఉందని చెప్తున్నారు. బీర్‌ వాడుకలోకి వచ్చిన తరువాత.. దాంట్లో ఉండే పోషకాలను దృష్టిలో పెట్టుకుని మద్యాన్ని బీర్‌తో రీప్లేస్‌ చేసి.. ఈ కొత్త స్పాలను వెలుగులోకి తీసుకువచ్చారు. ఇలాంటి లాభాలు ఉన్నాయి కాబట్టే ఈ స్పాలు ఎక్కడ ఉన్నా వెతుక్కుని వెళ్లి మరీ స్పా చేయించుకుంటున్నారు కస్టమర్లు.