Prompt Engineering: సరికొత్త టెక్నాలజీతో.. కోట్ల ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగాలు
ఐటీ అంటే ఉద్యోగం ఎక్కడ ఊడిపోతుందో అని బయపడే పరిస్థితి నేడు నెలకొంది. అలాంటి తరుణంలో కొత్త ఉద్యోగం తెరపైకి వచ్చింది. భవిష్యత్తు మొత్తం ఇక దీనిమీదే ఆధారపడి ఉండనుంది. అదే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్సు కావల్సిన విద్యార్హతలు ఏవో ఇప్పడు తెలుసుకుందాం.
ప్రాంప్ట్ ఇంజనీరింగ్
ప్రాంప్ట్ అంటే విషయాన్ని వివరించడం. ఒక భాషను ఇతరులకు తెలిసేలా వేగంగా అందించడం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే అవసరమైన విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకొని అడిగిన వాటికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వగలగడం. ఇది సాధారణంగా మనం మాట్లాడుకునే భాష కాదు. కంప్యూటర్ కి అవసరమైన భాషను ఖచ్చితంగా అత్యంత వేగంగా అందివ్వగలగాలి.
విద్యార్హతలు.. సబ్జెక్ట్ అవగాహన
ప్రాంప్ట్ ఇంజనీర్ గా ఉద్యోగం సాధించాలంటే కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీతో పాటూ ఇంగ్లీష్ భాషపై పట్టు ఉండాలి. గణాంకాలు, లెక్కలు బాగా తెలిసి ఉండాలి. టెక్నాలజీలో ఎప్పటికప్పుడు వచ్చే మార్పులపై అవగాహన ఉండాలి. జావా, ఆర్, జావా స్క్రిప్ట్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ల పై పట్టు, సాఫ్ట్ వేర్ టూల్స్ ను వాడగలిగే నైపుణ్యంతో పాటూ ఆర్టిఫీషియల్ టెక్నాలజీ అప్లికేషన్ గురించి తెలిసి ఉండాలి. అలాగే డేటా అనాలసిస్, కమ్యూనికేషన్ స్కిల్స్, వర్బల్ నాలెడ్జ్ మెండుగా ఉండాలి.
ప్రాంప్ట్ ఆధారంగా ఏఐ టెక్నాలజీ పనితీరు
మనం నిత్యం ఎన్నో రకాలా యాప్ లను, సాఫ్ట్ వేర్ లను చూస్తూ ఉంటాం. వాటిలో మనకు కావల్సిన నిర్థిష్ట సమాచారం కావాలంటే మన సర్చింగ్ కూడా అలాగే ఉండాలి. మనం ఇన్ పుట్ అందించిన వెంటనే ఏఐ మంచి అవుట్ పుట్ అందించాలంటే ఆ ఏఐ ని మనం ఆపరేట్ చేయగలగాలి. కంప్యూటర్ ఉపయోగించే వ్యక్తి ఏమి అడగాలనుకుంటున్నాడు. అతనికి కావల్సిన సమాచారం ఏంటి అనే పూర్తి అవగాహన మనకు ఉండాలి. అప్పుడే ఏఐ కి ఖచ్చితంగా అందించేందుకు వీలుపడుతుంది. ఇలా యూజర్ వేసే వాటిని మనం స్వీకరించి ఏఐ కి అందించడం వల్ల ఏఐ యూజర్ కి కావల్సిన డేటా మొత్తాన్ని అతి తక్కువ సమయంలోనే ఇవ్వగలుగుతుంది. ఇలా ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ కి యూజర్ కి మధ్య వారధిగా ప్రాంప్ట్ ఇంజనీర్ పనిచేస్తారు.
రానున్న రోజులు మొత్తం ప్రాంప్ట్ ఇంజనీర్లదే
ప్రస్తుత యుగంలో మనకు కావల్సిన సమాచారాన్ని గూగుల్ చేస్తూ ఉంటాం. అలా మనం అడిగిన విషయాలు గూగుల్ రిసీవ్ చేసుకొని మనకు కావల్సిన వివరాలను అవుట్ పుట్ రూపంలో ఎలా అందిస్తుంది. అదే తరహాలో ఏఐ కూడా పనిచేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అవసరం పెరిగే కొద్ది ప్రాంప్ట్ ఇంజనీర్లు అధికంగా అవసరం అవుతారు. ఇందులో మళ్లీ తిరిగి చాలా రకాలు ఉంటాయి. డైవర్సిఫికేషన్, స్పెషలైజేషన్, స్టాండర్డైజేషన్ వంటి వాటిగా రూపాంతరం చెందుతూ పోతుంది. ఇప్పటి వరకూ ఇన్ని రకాలు అందుబాటులో లేవు. ప్రస్తుతం చాట్ జీపీటీ వంటి వేదికలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. దీనిని కూడా అప్డేట్ చేస్తున్నారు. ఇది ఎంత త్వరగా అప్డేట్ అయితే అంత త్వరగా ప్రాంప్ట్ ఇంజనీర్లు అవసరం అవుతారు.
ప్యాకేజీలు ఇలా..
పిండి కొద్ది రొట్టె అన్నట్లు.. ఏఐ ని హ్యాండిల్ చేసే దానిని బట్టి మన ప్యాకేజి ఆధారపడి ఉంటుంది. పైన తెలిపిన సబ్జెక్టుల్లో సంపూర్ణమైన జ్ఞానం, అవగాహన, అనుభవం బట్టి ఏడాదికి కోట్లలో సంపాదించవచ్చు. నెలకు రూ. 50 లక్షల నుంచి రూ. 80 లక్షల వరకూ జీతాలను అందిస్తాయి కంపెనీలు. ప్రముఖ దిగ్గజ కంపెనీలైతే మరింత మెరుగుగా వేతనాలు అందించే అవకాశం ఉంటుంది.
T.V.SRIKAR