SONIA FROM HP RS : ఖమ్మంకు రానంటున్న సోనియా… హిమాచల్ నుంచి రాజ్యసభకు..
కాంగ్రెస్ పార్లమెంటరీ (Congress Parliamentary) పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని ... సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈమధ్యే సోనియాను కలసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె ఆరోగ్యం, వయస్సు రీత్యా లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీకి సుముఖంగా లేరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో సోనియాగాంధీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని అంటున్నారు.
కాంగ్రెస్ పార్లమెంటరీ (Congress Parliamentary) పార్టీ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ తెలంగాణ (Telangana) నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని … సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఈమధ్యే సోనియాను కలసి విజ్ఞప్తి చేశారు. కానీ ఆమె ఆరోగ్యం, వయస్సు రీత్యా లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) పోటీకి సుముఖంగా లేరని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దాంతో సోనియాగాంధీ హిమాచల్ ప్రదేశ్ స్టేట్ నుంచి రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేస్తారని అంటున్నారు.
ఖమ్మం (Khammam) లోక్ సభ నియోజకవర్గాలో అన్ని స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. పైగా ఈ స్థానం కోసం పార్టీలో చాలామంది నేతలు తీవ్రంగా పోటీపడుతున్నారు. వీళ్ళందరికీ చెక్ చెప్పేందుకు… సోనియాను ఖమ్మం నుంచి పోటీ చేయించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) భావించారు. రేవంత్, భట్టి, పొంగులేటి కలసి ఢిల్లీలో సోనియాగాంధీని కలసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. కానీ సోనియాగాంధీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె లోక్ సభ ఎన్నికల్లో కాకుండా… రాజ్యసభ ద్వారా ఎంపీ అవ్వాలని చూస్తున్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి ఈ రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి 3 సీట్లు, తెలంగాణ నుంచి రెండు, బిహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక్కోస్థానం దక్కుతాయి. వీటిల్లో సోనియాగాంధీ… హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీలో ఉంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ ను దించుతారని అంటున్నారు. ఇప్పటికే ఈ సీటు కోసం తెలంగాణకు చెందిన అనేకమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు పైరవీ చేస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం మాకెన్ కు కేటాయించవచ్చని తెలుస్తోంది. ప్రియాంక గాంధీ కూడా ఏదో ఒక రాజ్యసభ సీటు ఇస్తారని అనుకున్నారు. కానీ ప్రధాని మోడీ ఇటీవల కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ లీడర్లు… సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి భయపడుతున్నారనీ… అందుకే దొడ్డిదారిన రాజ్యసభ ద్వారా పార్లమెంట్ లోకి ప్రవేశిస్తున్నారని ఆరోపించారు. దాంతో ప్రియాంక గాంధీ రాజ్యసభ ఎన్నికల పోటీ నుంచి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు 15వరకూ మాత్రమే గడువు ఉంది. దాంతో ఇవాళ, రేపట్లో సోనియా పోటీ సంగతిని AICC ప్రకటించే అవకాశముంది.