Sonu Sood: దొంగకు సోనూసూద్ సాయం.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..
లక్షల మందిని సొంతూళ్లకు చేర్చేందుకు కోట్ల డబ్బు ఖర్చు చేశాడు. అన్నా సాయం అన్న మరుక్షణమే స్పందించి.. హెల్ప్ చేస్తుంటాడు సోనూసూద్. రీల్‌లో మాత్రమే విలన్.. రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. నిరుపేదులకు ఎన్నో రకాలుగా సాయం చేసిన సోనూ సూద్.. తన సేవను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు.

Sonu Sood: సోనూసూద్.. పరిచయం అవసరం లేని పేరు. సినిమాల్లో విలన్‌గా మాత్రమే తెలిసిన జనాలకు.. ఆయన ఎంత మంచివాడో కరోనా సమయంలో తెలిసొచ్చింది. వేల మంది ఆకలి తీర్చాడు. లక్షల మందిని సొంతూళ్లకు చేర్చేందుకు కోట్ల డబ్బు ఖర్చు చేశాడు. అన్నా సాయం అన్న మరుక్షణమే స్పందించి.. హెల్ప్ చేస్తుంటాడు సోనూసూద్. రీల్‌లో మాత్రమే విలన్.. రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్.
STUDENT SUCCESS: పెద్దల్ని, పెళ్లిని ఎదిరించింది.. విజేతగా నిలిచింది.. నువ్ సూపర్ తల్లీ..
నిరుపేదులకు ఎన్నో రకాలుగా సాయం చేసిన సోనూ సూద్.. తన సేవను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాడు. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఈ మధ్య గురుగ్రామ్‌లో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్.. కస్టమర్ ఇంటికి డెలివరీ చేయడానికి వెళ్లి షూ దొంగిలించడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అది సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీని మీద సోనూసూద్ రియాక్షన్ ఇప్పుడు మనసులను తడిపేస్తోంది. డెలివరీ బాయ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. అది అవసరం కాబట్టే తీసుకుని ఉండవచ్చు అంటూ సోనూసూద్ చేసిన పోస్ట్.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని ఎమోషనల్ చేస్తోంది. ఇంత మంచోడివేంటి బాస్ అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం సోనూసూద్ పోస్ట్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
దొంగతనాన్ని సమర్థించడం ఎంతవరకు సరైందని సోనూసూద్‌ను ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలోని లక్షలాది మంది జనాలు స్విగ్గీ డెలివరీ బాయ్ కంటే పేదలు ఉన్నారని మరికొందరు పోస్ట్ చేస్తున్నారు. దీనిపై మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఐతే కస్టమర్‌కు సరుకులు డెలివరీ చేసిన తర్వాత డోర్ బయట ఉంచిన షూలను స్విగ్గీ డెలివరీ బాయ్ దొంగిలించిన వీడియో సీసీ టీవీల్లో రికార్డ్ అయింది. ఆ వీడియో మీదే ఇప్పుడు ట్రోలింగ్ మొదలైంది.
If Swiggy’s delivery boy stole a pair of shoes while delivering food at someone’s house. Don’t take any action against him. In fact buy him a new pair of shoes. He might be really in need. Be kind ❤️🙏
— sonu sood (@SonuSood) April 12, 2024