Quinton de Kock: వరల్డ్ కప్ దగ్గర్లో రిటైర్మెంట్ ప్రకటన

ప్రపంచ కప్ మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో సౌతాఫ్రికాకు ఎదురుదెబ్బ తగిలింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 6, 2023 | 02:39 PMLast Updated on: Sep 06, 2023 | 2:39 PM

South Africa Star Opener Quinton De Kock Announces Retirement Ahead Of World Cup 2023

వరల్డ్‌ కప్‌ 2023 కోసం జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే క్రికెట్‌ సౌతాఫ్రికాకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 30 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ వన్డేలకు రిటైర్మెంట్ పలికారు. భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ అనంతరం 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించారు. 2021 లో 29 ఏళ్ళ వయసులో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన డికాక్.. వన్డే వరల్డ్ కప్ 2023 అనంతరం 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని ప్రకటించటం క్రికెట్ అభిమానులు ఆశ్చర్యపరిచింది. ఇంత తక్కువ వయసులో తప్పుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.

రిటైర్మెంట్ ప్రకటించాక.. అంతర్జాతీయ టీ20లతో పాటు ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రమే ఆడుతానని డికాక్ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా తరఫున 54 టెస్ట్‌లు, 140 వన్డేలు ఆడిన డికాక్, టెస్టుల్లో 6, వన్డేల్లో 17 సెంచరీలు చేశాడు. 2013లో వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన డికాక్.. 2016లో సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 178 పరుగులు నమోదు చేశాడు. ఇదే అతని అత్యధిక వ్యక్తిగత స్కోర్‌. ఇక వికెట్ కీపర్‌గా 183 క్యాచ్‌లు 14 స్టంపింగ్‌లు చేశాడు. కాగా, అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ప్రారంభంకానున్న వన్డే ప్రపంచకప్కు క్రి క్రికెట్ సౌతాఫ్రికా జట్టును ప్రకటించింది. టెంబా సారథ్యంలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.