సౌతాఫ్రికా టీ20 లీగ్… ముంబైతో సన్ రైజర్స్ తొలి మ్యాచ్

ఐపీఎల్ తర్వాత రెండు మూడు విదేశీ లీగ్స్ కే ఫాన్స్ క్రేజ్ ఉంది. వాటిలో ఒకటి సౌతాఫ్రికా టీ20 లీగ్... తాజాగా ఈ లీగ్ కు సంబందించిన షెడ్యూల్ విడుదలయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 3, 2024 | 01:35 PMLast Updated on: Sep 03, 2024 | 1:35 PM

South Africa T20 League Sunrisers First Match Against Mumbai

ఐపీఎల్ తర్వాత రెండు మూడు విదేశీ లీగ్స్ కే ఫాన్స్ క్రేజ్ ఉంది. వాటిలో ఒకటి సౌతాఫ్రికా టీ20 లీగ్… తాజాగా ఈ లీగ్ కు సంబందించిన షెడ్యూల్ విడుదలయింది. వచ్చే ఏడాది జనవరి 9 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 8 న ముగుస్తుంది.ఈ సీజన్ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తో తలపడుతుంది.

ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగితే… రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. కాగా వచ్చే సీజన్ కు సంబందించి సెయింట్ జార్జ్ పార్క్‌లో క్వాలిఫైయర్ 1.. సెంచూరియన్‌లో ఎలిమినేటర్‌,క్వాలిఫయర్ 2 మ్యాచ్ లు జరుగుతాయి. ఫైనల్ కు జోహన్నెస్‌బర్గ్‌ ఆతిధ్యమిస్తుంది. లీగ్ దశలో ఒక్కో జట్టు 10 మ్యాచ్‌లు ఆడుతుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి.