Dussahara Movies: ఈసారి దసరా మామూలుగా ఉండదు
విజయ దశమికి సత్తాచాటే హీరో ఎవరు అన్న చర్చ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా జరుగుతోంది.

South Indian movies are ready to enter the Dussehra ring
సౌత్ లో దసరా సీజన్ ఈసారి హాట్ గా మారింది. ఓకేసారి 5 పెద్ద ప్రాజెక్ట్స్ బరిలొ దిగడంతో పోటీ ఘాటెక్కుతోంది.విజయ దశమికి సత్తాచాటే హీరో ఎవరు అన్న చర్చ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో గట్టిగా జరుగుతోంది. టాలీవుడ్ లో ఈ ఏడాది దసరా కి పెద్ద సినిమాల మధ్య పోటీ హాట్ హాట్ గా మారింది. ముఖ్యంగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో, శివరాజ్ కుమార్ ఘోస్ట్ సినిమాలపై ఎక్స్ పెక్టేషన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ కావడంతో పాన్ ఇండియా రేంజ్ లో బిగ్ ఫైట్ షురూ కాబోతోంది.ఇప్పుడు వీటికి నార్త్ నుంచి గట్టి పోటీ ఇచ్చేందుకు సై అంటోంది టైగర్ ష్రాఫ్ గణపత్ మూవీ.
టైగర్ ష్రాఫ్ హీరోగా వికాస్ బాల్ డైరెక్ట్ చేస్తున్న గణపత్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. మొదటి పార్ట్ ‘ఏ హీరో ఈజ్బార్న్’ అనే ట్యాగ్ లైన్ తో రాబోతుంది. యాక్షన్ ఫిలింగా తెరకెక్కతున్న ఈ మూవీలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంటే అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించబొతున్నాడు. అక్టోబర్ 20న ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ కాబోతోంది. దీంతో వన్ డే గ్యాప్ లో పాన్ ఇండియా రేంజ్ లో 5 సినిమాల మధ్య దసరా వార్ జరగుబోతోంది. ప్రతి ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉండటంతో ఆడియన్స్ లో టెన్షన్ పీక్స్ కి చేరింది. మరీ విజయదశమికి ఏ సినిమా హిట్ కొడుతుందో..సౌత్,నార్త్ లో ఏ హీరో జెండా పాతుతాడో చూడాలి.