Smart Watch: నిద్ర సమస్యలను గుర్తించే సరికొత్త స్మార్ట్ వాచ్..
ఆరోగ్య సమస్యలతో పాటూ నిద్రించే సమయంలో మన జీవనాఢీ వ్యవస్థ ఎలా ఉంది. గుండె ఎలా కొట్టుకుంటుంది. రక్తప్రసరణ ఏ స్థాయిలో జరుగుతుందో తెలుసుకునే సరికొత్త స్మార్ట్ వాచ్ ను దక్షిణ కొరియా కు చెందిన సంస్థ తీసుకొచ్చింది.
నేటి యుగంలో ప్రతి ఒక్క వస్తువు స్మార్ట్ గా తయారైంది. అందులో భాగంగా సరికొత్త వాచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్య సమస్యలను గుర్తించేందుకు, గుండె పనితీరును కనుగొనేందుకు వెసులుబాటు ఉంటుంది. అలాగే రక్తప్రసరణ, బీపీ, పల్స్ వంటివి చెక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తాజాగా దక్షిణ కొరియాకు చెందిన శాంసగ్ గెలాక్సీ వాచ్ 5 ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ వాచ్ ను ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
ఈ వాచ్ ను ఉపయోగించడం వల్ల నిద్రలేమి సమస్యలను అధిగమించేందుకు దోహదపడుతుందని చెబుతున్నారు. ఎంతసేపు నిద్రపోతున్నారు. నిద్రలో వచ్చే సమస్యలు గుర్తించేదుకు ఉపయోగిస్తారు. గురక, శ్వాసలో సమస్యలు గుర్తించవచ్చు. తద్వారా ముందుగానే అవసరమైన పరీక్షలు చేసుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు డాక్టర్లను సంప్రదించి తగు చికిత్స తీసుకోవచ్చు. ఇలా కనుగొనేందుకు ప్రత్యేకమైన యాప్ ఉంటుంది. దీనిని మన స్మార్ట్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలో అందుబాటులోకి రానునన్నట్లు తెలిపారు కంపెనీ ప్రతినిథులు. దీని ధరను మాత్రం ఇంకా ప్రకటించలేదు.
T.V.SRIKAR