Weather update : నైరుతి రుతుపవనాలు.. 3-4 రోజుల్లో ఏపీకి, 10 రోజుల్లో తెలంగాణకు!!
అరేబియా సముద్రం (Arabian Sea) లో పడమర గాలులు మరింత బలపడితే 3-4 రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ (Weather) నిపుణులు అంచనా వేస్తున్నారు.

Southwest Monsoon.. AP in 3-4 days, Telangana in 10 days!!
అరేబియా సముద్రం (Arabian Sea) లో పడమర గాలులు మరింత బలపడితే 3-4 రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ (Weather) నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు జూన్ 10లోగా తెలంగాణకు చేరుకుంటాయని తెలిపారు. రుతుపవనాల వల్ల ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణశాఖ ఇప్పటికే తెలిపింది. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎక్కువ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
రేపటి నుంచి భారీ వర్షాలు..
తెలంగాణలో రేపటి నుంచి 5 రోజులు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు(Thunder), మెరుపుల (Lightning) తోపాటు గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. రేపు వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, HYD, వికారాబాద్, సంగారెడ్డి, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జూన్ 10 లోపు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.