Weather Update : తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) వేగంగా విరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 11, 2024 | 01:15 PMLast Updated on: Jun 11, 2024 | 1:15 PM

Southwest Monsoon Spread In Telugu States Heavy Rains In These Districts

 

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) వేగంగా విరిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలతో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. తెలంగాణలో మరో మూడు రోజులు పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు(మంగళవారం) హైదరాబాద్ తో పాటు యాదాద్రి- భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, గద్వాల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (weather station) వెల్లడించింది. భారీ వర్షాలతో పాటు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక APలోని అల్లూరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.

నిన్న తెలంగాణ లో అత్యధికంగా వికారాబాద్ జిల్లా తాండూరు, పెద్దేముల, దోమ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిల ప్రాంతంలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నేడు హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి.