Prime Minister Modi : మోడీ ప్రమాణస్వీకారానికి స్పెషల్‌ ఇన్విటేషన్‌.. ఎవరీ ఐశ్వర్య మీనన్‌ ?

హ్యాట్రిక్‌ విక్టరీతో మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో మోడీ పీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాలతో పాటు భారతదేశం నలుమూలల నుంచి 8 వేల మంది అతిథులు హాజరుకాబోతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 8, 2024 | 01:44 PMLast Updated on: Jun 08, 2024 | 1:44 PM

Special Invitation For Modis Swearing In Every Aishwarya Menon

హ్యాట్రిక్‌ విక్టరీతో మూడోసారి భారత ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఢిల్లీలో మోడీ పీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాలతో పాటు భారతదేశం నలుమూలల నుంచి 8 వేల మంది అతిథులు హాజరుకాబోతున్నారు. అయితే ఈ గెస్ట్ లిస్టులో ఐశ్వర్య మీనన్‌, సురేఖ యాదవ్‌ కూడా ఆహ్వానం అందింది. దీంతో అందరి దృష్టి వీళ్లపై పడింది.

దీంతో ఎవరీ ఐశ్వర్య మీనన్ ? మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానం దక్కించుకోవడం వెనుక ఆమెకు ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. ఐశ్వర్య మీనన్ సౌత్‌సెంట్రల్‌ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, జన శతాబ్ది లాంటి రైళ్లను నడుపుతూ ఐశ్వర్య మీనన్ రెండు లక్షలకు పైగా ఫుట్‌ప్లేట్ గంటలను పూర్తి చేసింది. డ్యూటీలో చురుకుదనం, రైల్వే సిగ్నలింగ్‌పై ఆమెకున్న సమగ్ర పరిజ్ఞాంతో.. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలను అందుకుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వందేభారత్ ట్రైన్‌లో ప్రస్తుతం లోకో పైలట్‌గా వ్యవహరిస్తోంది. ఐశ్వర్య.. చెన్నై-విజయవాడ, చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ప్రారంభించినప్పటి నుండి నడిపారు.

దీంతో మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకున్న రైల్వే ఉద్యోగుల గెస్ట్ లిస్టుల జాబితాలో ఆమె పేరును కూడా చేర్చారు. ఇక మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆసియా తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్‌కు సైతం ఆహ్వానం అందింది. సురేఖ యాదవ్ 1988లో భారతదేశపు తొలి మహిళా లోకోపైలట్‌గా చరిత్ర సృష్టించారు. సురేఖ యాదవ్.. సోలాపూర్ నుండి వందే భారత్ రైలును నడుపుతున్నారు. ఈమె సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కి మొదటి మహిళా లోకో పైలట్‌గా పని చేసి రికార్డు సృష్టించారు. దీంతో ఈమె మోడీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానం పొందారు.