Congress New Manifesto : తెలంగాణ కోసం ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్.. నూతన పథకాలతో మేనిఫెస్టో విడుదల

తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఈ నెల 13న లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్నాయి. కాగా లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రచారంలో దూకుడు పెంచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 2, 2024 | 01:30 PMLast Updated on: May 02, 2024 | 1:30 PM

Special Manifesto Release For Telangana Manifesto Release With New Schemes

తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఈ నెల 13న లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరగనున్నాయి. కాగా లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రచారంలో దూకుడు పెంచింది. నిత్య ప్రజల్లో ఉండు రోడ్ షోలు (Road shows).. భారీ బహిరంగ సభలు.. సమావేశాలు అంటూ ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుని ఓట్లు దండుకునే విధంగా రేవంత్ రెడ్డి ప్ర‌సంగాలు నిర్వ‌హిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంట్ పోరులోనూ రిపీట్ చేయాలని సీఎం రేవంత్ (CM Revanth Reddy) భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మేజారిటీతో గెలిస్తే ఏం చేస్తుందో వివ‌రిస్తు ముందుకెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌వేశ‌పెట్టిన మేనిఫెస్టోతో పాటు మ‌రికొన్ని హామీల‌ను క‌లిపి మేనిఫెస్టోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎ రేవంత్‌. ఈ క్ర‌మంలో రేపు కాంగ్రెస్ పార్టీ త‌న మేనిఫెస్టోను విడుద‌ల చేయ‌నుంది.

తెలంగాణల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ రేపు విడుదల చేయనుంది. రేపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనుండగా.. కేంద్రంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామనే విషయాన్ని వెల్లడించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లకు మేనిఫెస్టోలో చోటు కల్పించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

SSM