Sankranti Special Trains : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

చూస్తు చూస్తు ఉండగానే 2023 సంవత్సరం అయిపోవచ్చింది.. మన సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది. సంక్రాంతి అంటేనే పల్లె పండుగ.. ( మన తెలుగు వారి పండుగ ) పట్నం వీరి పల్లేకు చేరే సమయం అసన్నమైంది మరి.. ఎన్నో రోజులు లేవు.. వచ్చే నెలలో సంక్రాంతి పండుగ. మరి మన పండుగకు ప్రయాణికుల రద్దీ ఉంటుందిగా మరి అందుకే.. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 03:02 PMLast Updated on: Dec 22, 2023 | 3:02 PM

Special Trains On The Occasion Of Sankranti Festival

చూస్తు చూస్తు ఉండగానే 2023 సంవత్సరం అయిపోవచ్చింది.. మన సంక్రాంతి పండుగ కూడా వచ్చేస్తుంది. సంక్రాంతి అంటేనే పల్లె పండుగ.. ( మన తెలుగు వారి పండుగ ) పట్నం వీరి పల్లేకు చేరే సమయం అసన్నమైంది మరి.. ఎన్నో రోజులు లేవు.. వచ్చే నెలలో సంక్రాంతి పండుగ. మరి మన పండుగకు ప్రయాణికుల రద్దీ ఉంటుందిగా మరి అందుకే.. దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని.. 20 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

ఇవి హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-కాకినాడ టౌన్‌ రూట్లలో నడుస్తాయి. సికింద్రాబాద్ నుంచి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రకు వెళ్లేవారి సౌకర్యార్ధం ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నారు. డిసెంబర్‌ 28 నుంచి జనవరి 26 వరకు సంక్రాంతి స్పెషల్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఆ రైళ్ల పూర్తి వివరాలు ఎస్‌సీఆర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

హైదరాబాద్‌ – తిరుపతి మధ్య 07509, 07510 నంబర్లు కలిగిన రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇవి సికింద్రాబాద్‌, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా నడుస్తాయి. ఇక కాచిగూడ – కాకినాడ టౌన్‌ మధ్య 07653 , 07654 నంబర్లు కలిగిన రెండు రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఇవి మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వేస్టేషన్ల మీదుగా నడుస్తాయి.

రైల్వే శాఖ వెల్లడించిన వివరాలు..

  • కాచిగూడ – కాకినాడ టౌన్‌ ట్రైన్ (నంబర్ 07653) గురువారం రాత్రి 8.30 గంటలకు బయలుదేరి, శుక్రవారం ఉదయం 8 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 28, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
  • తిరుపతి – హైదరాబాద్‌ ట్రైన్ (నంబర్ 07510) శుక్రవారం రాత్రి 8.15 గంటలకు బయలుదేరి, శనివారం ఉదయం 8.40 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది.
  • హైదరాబాద్‌ – తిరుపతి ట్రైన్ (నంబర్ 07509) గురువారం రాత్రి 7.25 గంటలకు బయలుదేరి, శుక్రవారం ఉదయం 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 4, 11, 18, 25 తేదీల్లో నడుస్తుంది.
  • కాకినాడ టౌన్‌ – కాచిగూడ ట్రైన్ (నంబర్ 07654) శుక్రవారం సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి శనివారం తెల్లవారు జామున 4.50 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ రైలు డిసెంబర్‌ 29, జనవరి 5, 12, 19, 26 తేదీల్లో నడుస్తుంది.

అదేవిధంగా కాచిగూడ-కాకినాడ టౌన్‌, కాకినాడ టౌన్-కాచిగూడ స్పెషల్ రైళ్లు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తాయి.