Jadeja : జడేజా నేర్పిన విద్య..
వరల్డ్ కప్ లో స్పిన్నర్ల హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా సత్తా చాటగా నిన్న జరిగిన నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 5 వికెట్లతో చెలరేగాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో కివీస్ భారీ విజయం సాధించడంలో ఈ స్పిన్ ఆల్రౌండర్ కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Spinners continue to dominate the World Cup So far Shakib Mehdi Hasan Miraj Kuldeep Yadav and Jadeja have all done well
వరల్డ్ కప్ లో స్పిన్నర్ల హవా కొనసాగుతుంది. ఇప్పటివరకు షకీబ్, మెహదీ హసన్ మిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా సత్తా చాటగా నిన్న జరిగిన నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచులో న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 5 వికెట్లతో చెలరేగాడు. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో కివీస్ భారీ విజయం సాధించడంలో ఈ స్పిన్ ఆల్రౌండర్ కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
అయితే తనకు ఈ అవార్డు రావడానికి జడేజా అని చెప్పుకొచ్చాడు సాంట్నర్. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున జడేజా- సాంట్నర్ జోడీ కలిసి ఆడిన సంగతిని తెలిసిందే. వీరిద్దరూ కూడా ఆల్ రౌండర్లే కావడంతో వీరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ సమయంలో ఇక్కడ జడేజా ఎలా బౌలింగ్ చేసేవాడో తాను తీక్షణంగా పరిశీలి చేవాడినని.. ఇది వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో బాగా ఉపయోగపడుతుందని సాంట్నర్ చెప్పుకొచ్చాడు.
జడేజాను చూసి తాను చాలా నేర్చుకున్నానని, ఈ రోజు ఇంత బాగా బౌలింగ్ చేయడానికి అతడే కారణమని సాంట్నర్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు తీసిన సాంట్నర్.. 2023 వరల్డ్ కప్ లో తొలిసారి ఈ ఘనత సాధించిన బౌలర్ గా నిలిచాడు. సాంట్నర్ విజృంభనతో కివీస్ కు 99 పరుగుల భారీ విజయం దక్కింది. బ్యాటింగ్ లో కూడా 17 బంతుల్లోనే 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సాంట్నర్ తో పాటు బ్యాటర్లు కూడా సమిష్టిగా రాణించడంతో ఈ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకొని పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది.