Virat Kohili: ప్రేమతో పెయింటింగ్ నీకోసమే రాజా!
విరాట్ కోహ్లీకి శ్రీలంక యువతి పెయింటింగ్ బహుమతిగా ఇచ్చింది.

Sri Lankan woman gifted Virat Kohli with a painting.
భారత స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు ‘విరాట్ కోహ్లీ’కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కింగ్ కోహ్లీకి ఫాన్స్ ఉన్నారు. దాయాది పాకిస్తాన్‌లోనూ చాలా మందే అభిమానులు ఉన్నారు. ఇటీవల కోహ్లీ ఆటను చూసేందుకు పాక్‌కు చెందిన ఓ లేడీ అభిమాని ఏకంగా శ్రీలంకకు వచ్చింది. తాజాగా ఓ శ్రీలంక యువతి తన అభిమాన క్రికెటర్ కోహ్లీని కలిసి తెగ సంబరపడిపోయింది. ఈ లేడీ ఫాన్ తన చేతితో తయారు చేసిన పెయింటింగ్ ను కోహ్లీకి అందజేసింది. ఇటీవలి కాలంలో కోహ్లీ ఎమోషనల్ మూమెంట్‌ను ఆమె స్వయంగా గీసింది. ఈ విషయం కోహ్లీకి చెబుతూ ఆనందపడిపోయింది.గిఫ్ట్ తీసుకున్న కోహ్లీ.. ఆమెకు థాంక్స్ చెప్పి ఫొటో దిగాడు. ఇందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేసిన అనంతరం కోహ్లీ చేసుకున్న సంబరాలకు సంబందించిన మూమెంట్‌ను ఈ శ్రీలంక ఫ్యాన్ గర్ల్ పెయింటింగ్ వేసివ్వడం ఇక్కడ కొసమెరుపు.