శ్రీలంక వరుస విజయాలు కోచ్ జయసూర్య కాంట్రాక్ట్ పొడిగింపు
శ్రీలంక హెడ్‌కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పదవీకాలాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు మరో ఏడాది పాటు పొడిగించింది. జూలైలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ తో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జయసూర్య బాధ్యతలు చేపట్టాడు.

శ్రీలంక హెడ్‌కోచ్‌గా దిగ్గజ క్రికెటర్ సనత్ జయసూర్య పదవీకాలాన్ని ఆ దేశ క్రికెట్ బోర్డు మరో ఏడాది పాటు పొడిగించింది. జూలైలో భారత్‌తో జరిగిన వన్డే సిరీస్ తో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్‌గా జయసూర్య బాధ్యతలు చేపట్టాడు. టీమిండియాతో టీ20 సిరీస్ కోల్పోయినప్పటకి వన్డేల్లో మాత్రం లంక అదరగొట్టింది. తర్వాత ఇంగ్లాండ్ గడ్డపైనా లంక నిలకడగా రాణించింది. ఈ క్రమంలో గత మూడు నెలలగా జయసూర్య నేతృత్వంలో లంక జట్టు తమ పూర్వ వైభవంగా దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా సొంతగడ్డపై కివీస్ ను 2-0తో వైట్ వాష్ చేసిన లంక డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్ కు దూసుకొచ్చింది. ఈ నేపథ్యంలో జయసూర్యను కోచ్ గా మరో ఏడాది కొనసాగించాలని లంక బోర్డు నిర్ణయించింది.