Sridhar Babu: అప్పుల పాలు చేసి అహంకారమా.. బీఆర్ఎస్ నేతలపై శ్రీధర్ బాబు ఫైర్

ప్రజలు ఓటమి రుచి చూపించినా ఇంకా అదే అహంకార రీతిలో BRS నేతలు మాట్లాడుతున్నారు. BRS విడుదల చేసిన ఒక బుక్‌లెట్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. 3,500 రోజులు పాలించిన వాళ్ళే కాంగ్రెస్ వచ్చి 30 రోజులు కూడా కాలేదు. అప్పుడే అక్కసు వెళ్లగక్కడమేంటి..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 4, 2024 | 06:13 PMLast Updated on: Jan 04, 2024 | 6:13 PM

Sridhar Babu Fires On Brs Leaders Ktr And Harish Rao

Sridhar Babu: పదేళ్లు రాష్ట్రాన్ని పాలించి, అప్పుల పాలు చేసిందే కాకుండా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ నేతలకు తగదని విమర్శించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్‌పై కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు పదేపదే ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు. గురువారం శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌పై పలు విమర్శలు చేశారు. “మూడో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మార్పు కావాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏడో తేదీన ప్రభుత్వం ఏర్పడింది,. సీఎం డిప్యూటీ సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశాం. మీరు BRS 201 లో ప్రభుత్వం ఏర్పడిన ముప్పై ఆరు రోజుల తర్వాత రాష్ట్ర శాసనసభ సమావేశాలు పెట్టారు.

TS CONSTABLE: తెలంగాణ కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉద్యోగాల నియామకాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

సుమారు రెండు నెలల తర్వాత మంత్రి వర్గం ఏర్పాటు చేశారు. ఇది బాధ్యత రాహిత్యం కాదా.. ప్రజలు ఇచ్చిన తీర్పును అపహస్యం చేశారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లో ఇచ్చిన హామీలు అమలు మొదలు పెట్టాము. హామీల్లో రెండు ప్రధానమైన వాటిని నెరవేర్చాం. మహిళా సోదరీమణుల కోసం ఫ్రీ బస్ సర్వీస్ సేవలు ప్రారంభించాం. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు సేవలు వినియోగించుకున్నారు. పదేళ్ల నుంచి ప్రజారోగ్యం గాలికి వదిలేసిన పార్టీ, ప్రభుత్వం BRS కాదా..? కాంగ్రెస్ వచ్చిన వెంటనే రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచాం. ప్రజలు ఓటమి రుచి చూపించినా ఇంకా అదే అహంకార రీతిలో BRS నేతలు మాట్లాడుతున్నారు. BRS విడుదల చేసిన ఒక బుక్‌లెట్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ఖండిస్తోంది. 3,500 రోజులు పాలించిన వాళ్ళే కాంగ్రెస్ వచ్చి 30 రోజులు కూడా కాలేదు. అప్పుడే అక్కసు వెళ్లగక్కడమేంటి..? ఓర్వలేక నియంతృత్వ దోరణితో, మేనిఫెస్టోపై కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా వ్యవరిస్తున్నారు. ఎందుకు ఇంత గగ్గోలు.. ఎందుకింత తొందరపాటు.. ప్రజలకి ఇచ్చిన వాగ్దానాలను ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేస్తూ వస్తున్నాం.

REVANTH REDDY: మహిళలకు రేవంత్‌ శుభవార్త.. రూ.2500 అప్పటి నుంచే..

మీ దగ్గర మంచి సూచనలు ఉంటే మాకు ఇవ్వండి. మేము స్వీకరించడానికి సిద్దంగా ఉన్నాం. పదేళ్లు పాలించి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి.. ఇప్పుడు మేం వచ్చిన 30 రోజులకే ఇంత అహంకారంగా వ్యవహరించడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. BRS భవన్‌లో ఉండి ప్రెస్‌మీట్ పెట్టడం కాదు.. ఒక్కసారి గ్రామంలోకి వెళ్లి అక్కచెల్లెళ్ళను అడగండి. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. ప్రజా పాలన ఎలా ఉందో.. ఉంటుందో కళ్ళారా చూస్తూనే ఉన్నారు కాదా. ప్రజా దర్బార్ పెడితే.. వేలాది మంది వచ్చి విజ్ఞప్తులు చేస్తున్నారు. BRS పాలనలో ఒక్కసారైనా మీరు ప్రజలను కలిసారా.. వల్ల గోస విన్నారా..? లేదు. అందుకే మీ అహంకార పూరిత పాలనకు చరమగీతం పాడారు కదా. అయిన ఇంకా మారకుండా అర్దంపర్దం లేని ఆరోపణ చేస్తున్నారు. 2014, 2018లో BRS ఇచ్చిన దళిత CM, మూడెకరాల భూమి,12 శాతం ముస్లిం రిజర్వేషన్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య.. ఇలా చెప్పిన మీ హామీల సంగతిపై మాట్లాడితే బాగుంటుంది. కేంద్రం ఇచ్చిన విభజన హామీల్లో ఏం ఒక్కదానిపైన అయిన పోరాటం చేశారా..?

బయ్యారం ఉక్కు, ప్రాజెక్టులకు జాతీయ హోదా.. ట్రైబల్ యూనివర్సిటీ.. ఏ ఒక్కదానిపైన మీరు ఉద్యమించిన దాఖలాలు లేవు. కాబట్టి ప్రజలకి తెలుసు.. ఎవరు 420.. ఎవరు డబుల్ 420నో. ముందు పార్టీని చక్కదిద్దుకోవాలీ. అంతేగానీ అధికారం దూరమయ్యింది అనే అక్కసుతో ఆరోపణలు చేయడం అధికార దుగ్ధగా కనిపిస్తోంది. కొంతమంది ఆటో డ్రైవర్‌లను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే BRSకి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం వద్దు అని భావిస్తున్నారా..? రాజకీయాల కోసం ఆటో డ్రైవర్స్‌ను బలి చెయ్యొద్దు. మేము, మా ప్రభుత్వం వారికి కూడా న్యాయం చేసే కార్యాచరణ రూపొందిస్తున్నాం. మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో ఒక్కసీట్ కూడా గెలవదు అన్న ఉద్దేశంతోనే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు” అని శ్రీధర్ బాబు అన్నారు.