Sree Leela: ఏం మాయ చేశావే
ఏడాదిలో ప్రతీ పండక్కి రిలీజ్ కానున్న శ్రీలీల సినిమాలు. స్కంద నుంచి అనగనగా ఓ రాజు వరకు వరుస సినిమాల్లో నటిస్తూ అభిమానులకు వినోదాన్ని అందించనుంది. దసరా, సంక్రాంతి, హోలి ఏ పండుగను వదలని శ్రీలీల సినీ చరిత్రను తిరగరాస్తోంది.

Srileela is coming to entertain the audience with a series of movies
శ్రీలీలా మహేశ్ బాబుతో జోడీకట్టింది. పవన్ తో జోడీ కడుతోంది. బాలయ్య మూవీ చేసింది. నితిన్, రామ్, వైష్ణవ్ తేజ్ ఇలా యంగ్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ఇంకా నవీన్ పోలి శెట్టి మూవీలో కూడా మెరవబోతోంది. అంతా బానే ఉంది. డజన్ కి పైనే ఆఫర్లు సింగిల్ హిట్ ధమాకా పుణ్యమాని కొత్త ఆఫర్లు పట్టింది. అంతవరకు ఓకే కాని ఏ హీరోయిన్ కి దక్కని ఒక విచిత్రమైన రికార్డు సౌత్ ఇండియాలోనే శ్రీలీలా దక్కించుకుంటోంది.
అదేంటంటే ఈనెల 28 న స్కంద మూవీతో మొదలు వచ్చే ఏడాది దసరాకు వచ్చే నవీన్ పోలి శెట్టి మూవీ వరకు ఏడాది పొడవునా, ప్రతీ పండక్కి ప్రతీ సీజన్ కి తన సినిమానే రిలీజ్ కాబోతోంది. పెద్ద హీరోలు, చిన్న హీరోలు ఇలా అన్నీ కలుపుకుని పది సినిమాలకు పైనే విడుదల కాబోతున్నాయి. వెండితెరమీద శ్రీలీల అందాలే వెలగబోతున్నాయి.
ఈనెల 28న స్కంద వస్తోంది. వచ్చే నెల భగవంత్ కేసరి, తర్వాత నెల ఆదికేశవ్ అంటూ వైష్ణవ్ తేజ్ మూవీ రానుంది.. ఇక క్రిస్మస్ కి నితిన్ తో శ్రీలీల చేసిన ఎక్స్ ట్రా వస్తుంటే, సంక్రాంతికి గుంటూరు కారం, హోలీ సీజన్ కి నితిన్ తో వెంకీ కుడుముల చేసే సినిమా వచ్చేలా ఉంది. ఇక ఉగాదికి పవన్ తో శ్రీలీల చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంటే, నవీన్ పోలిశెట్టితో శ్రీలీల చేయనున్న మూవీ వచ్చే ఏడాది దసరాకు రానుంది. సో ఈ దసరా నుంచి వచ్చే దసరా వరకు వెండితెరంతా ఒకే ఒక్క హీరోయిన్ వరుసగా వెలగబోతోంది. అది కన్నడ లేడీ శ్రీలీలానే.. ఇలాంటి రికార్డు సౌత్ ఇండియా లో ఎవరికీ దక్కలేదు. హిందీలో మాత్రం శ్రీదేవి ఇలా మూడే ళ్లు నార్త్ ని గ్యాప్ లేకుండా ఊపేసింది. 15 ఏళ్లు టాప్ హీరోయిన్ గా నిలిచింది.