Srileela films : శ్రీలీల పని ఐపోయిందా బండి షెడ్డుకి వచ్చేసిందా..?

శ్రీలీల వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది. క్షణం తీరిక లేకుండా డేట్స్‌ ఇచ్చేస్తుంది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరితో జతకడుతోంది. అంతా బాగానే ఉన్నా.. గుర్తిండిపోయే పాత్రలు ఎందుకు చేయడం లేదు. క్వాంటిటీనే చూసుకుంటోందిగానీ.. క్యారెక్టర్‌లో క్వాలిటీ గురించి ఈ అమ్మడికి పట్టదు. క్రేజీ హీరోయిన్‌ అన్న ఐడెంటిటీ తప్ప.. మంచి పెర్పార్మర్‌ అన్న పేరుతో శ్రీలీలకు పని లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 2, 2023 | 09:49 AMLast Updated on: Oct 02, 2023 | 9:49 AM

Srileela Makes Films In A Row Gives Dates Without A Moments Hesitation It Connects With Everyone Big Or Small

హీరోయిన్‌ అంటే డ్యాన్సులకే పరిమితమా?
హీరోయిన్‌ అంటే నాలుగైదు సీన్స్‌లో కనిపిస్తే సరిపోతుందా?
గ్లామర్‌ గుమ్మరిస్తే.. క్రేజ్ వస్తుందన్న భ్రమలో శ్రీలీల వుందా?
అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తేనే గొప్ప అని ఫీలవుతోందా?
పెర్ఫార్మెన్స్‌కు స్కోప్‌ లేని సినిమాలు ఎన్ని చేసినా ఉపయోగం ఏంటి?
ఇదే లెక్కతో శ్రీలీల కెరీర్‌ గాడి తప్పిందా?
ఫేడౌట్‌ అవుతున్న సంగతి ఈ అమ్మడికి తెలీయడం లేదా?

శ్రీలీల కెరీర్‌కు ఫుల్‌స్టాప్‌ పడుతోందా..? అనిపిస్తుంది.

శ్రీలీల వరుస పెట్టి సినిమాలు చేసేస్తుంది. క్షణం తీరిక లేకుండా డేట్స్‌ ఇచ్చేస్తుంది. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరితో జతకడుతోంది. అంతా బాగానే ఉన్నా.. గుర్తిండిపోయే పాత్రలు ఎందుకు చేయడం లేదు. క్వాంటిటీనే చూసుకుంటోందిగానీ.. క్యారెక్టర్‌లో క్వాలిటీ గురించి ఈ అమ్మడికి పట్టదు. క్రేజీ హీరోయిన్‌ అన్న ఐడెంటిటీ తప్ప.. మంచి పెర్పార్మర్‌ అన్న పేరుతో శ్రీలీలకు పని లేదు. సినిమాల మీద సినిమాలు వచ్చి పడుతున్నాయి. సినిమాకు రెండు కోట్లు డిమాండ్‌ చేస్తోంది. బిజీయెస్ట్‌ హీరోయిన్‌ అన్న బిరుదు కోసం.. ఫేస్‌లో కళ పోగొట్టుకుటోంది శ్రీలీల. స్కంద.. భగవంత్‌ కేసరిలో ఈ అమ్మడి చూస్తే.. ఇది నిజమే అనిపిస్తోంది. ఇలా పరిగెడుతూ పోతే గ్లామర్ దెబ్బ తింటుందని బోయపాటి హెచ్చరించగా.. డైరెక్టర్‌ చెప్పిందే నిజమవుతోంది. పెళ్లి సందడిలో ఉన్న కళ ఈ అమ్మడితో కనిపించడం లేదు.

బోయపాటి చెప్పింది నిజం అవుతుందా..?

బోయపాటి చెప్పినట్టు.. గ్లామర్‌ దెబ్బతినడంతో.. చేతిలో వున్ననాలుగు సినిమాలు పూర్తి కావస్తున్నా.. కొత్త సినిమాకు సైన్‌ చేయలేదు శ్రీలీల. గత నెల 28న రిలీజ్ అయిన స్కంద.. నవంబర్‌లో వస్తున్న ఆదికేశవ షూటింగ్‌ పూర్తయింది. భగవంత్‌ కేసరి.. నితిన్‌ ఎగస్ట్రా కలిపి ఓ పది రోజుల వర్క్‌ మాత్రమే బ్యాలెన్స్‌ వుంది. దీంతో నాన్‌స్టాప్‌ యాక్టింగ్‌ నుంచి శ్రీలీలకు కాస్త రెస్ట్ దొరికింది. శ్రీలీల బాగా డ్యాన్స్‌ చేస్తుంది. ఎనర్జిటిక్‌గా కనిపిస్తుంది అన్న ప్రశంసలు తప్ప పాత్రకు ప్రాణం పోసిందన్న మాట ఇంతవరకు తెచ్చుకోలేదు. కొద్దిగో గొప్పో.. పెళ్లిసందడిలోనే కాస్త ఐడెంటిటీ దక్కింది. ఆతర్వాత వచ్చిన ధమాకా, స్కందలో పాటలకు నాలుగైదు సీన్స్‌కు పరిమితమైంది.

శ్రీలీల ఓ మంచి డ్యాన్సర్‌.. ఓ వెలుగు వెలిగి కనిపించకుండా పోయిన హీరోయిన్‌గా మిగిలిపోతుందా? దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి ఫార్ములా ఫాలో అవుతుందే గానీ.. ఓ పదేళ్లు ఇండస్ట్రీ లో ఉండాలి. క్రేజీ హీరోయిన్‌ ఇమేజ్‌ కంటిన్యూ చేయాలన్న ఆలొచన ఈఅమ్మడికి ఏ కోశానా కనిపించడం లేదు. లేటెస్ట్‌గా వచ్చిన స్కందలో రామ్‌, శ్రీలీల మధ్య నాలుగైదు సీన్స్‌.. రెండు పాటల్లో మాత్రమే మెరిసింది.
స్కందలో రామ్‌ శ్రీలీలను ఏవరేజ్‌ అందమంటూ టీజ్‌ చేస్తూ ఉంటాడు. మున్ముందు తగ్గేదే లేదంటూ.. సినిమాల సంఖ్యను మాత్రమే చూసుకుంటే.. ఈ అందం ఏవరేజ్‌ నుంచి ఫ్లాప్‌లోకి పడిపోయినా ఆశ్చర్యం లేదు. స్కంద తర్వాత శ్రీలీల భగవంత్‌ కేసరితో దసరాకు అడుగుపెడుతోంది. ఇందులో ఇంపార్టెంట్‌ రోలే దక్కిందంటున్నారు. గుంటూరు కారంలో పెర్‌పార్మెన్స్‌కు స్కోప్‌ వున్న రోల్‌ గురూజీ ఇచ్చాడా? మరి అప్‌కమింగ్‌ మూవీస్తో అయినా.. శ్రీలీల తన యాక్టింగ్‌ స్కిల్స్‌ చూపిస్తుందా? లేదంటే.. వున్న ఆఫర్స్‌తో సరిపెట్టుకుని.. ఫేడౌట్‌ అయిపోతుందేమో చూడాలి మరి.