శ్రీనివాస్‌@నాగసాధు అఘోరీ అసలు బ్యాగ్రౌండ్‌ ఇదే

తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు అఘోరీ టాపిక్కే వినిపిస్తోంది. ఆ రెడ్‌ కారు.. కారులో పుర్రెలతో అఘోరీ కనిపిస్తే చాలు అంతా సెల్ఫీల కోసం ఎగబడిపోతున్నారు. అఘోరీ అమ్మ దీవెనల కోసం పోటీ పడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 22, 2024 | 07:05 PMLast Updated on: Oct 22, 2024 | 7:05 PM

Srinivasnagasadhu This Is The Real Background Of Aghori

తెలంగాణలో.. ముఖ్యంగా హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఇప్పుడు అఘోరీ టాపిక్కే వినిపిస్తోంది. ఆ రెడ్‌ కారు.. కారులో పుర్రెలతో అఘోరీ కనిపిస్తే చాలు అంతా సెల్ఫీల కోసం ఎగబడిపోతున్నారు. అఘోరీ అమ్మ దీవెనల కోసం పోటీ పడుతున్నారు. కేదార్‌నాథ్‌ నుంచి వచ్చిన అమ్మవారి దర్శనం కోసం పరితపిస్తున్నారు. వాళ్ల ఎయిటింగ్‌కు తగ్గట్టే అఘోరీ అమ్మ కూడా దైవ వాక్కులతో అందర్నీ మరిపిస్తున్నారు, మురిపిస్తున్నారు. మరి ఇంత చెప్తున్న, చేస్తున్న అమ్మవారు నిజంగానే కేదార్నాథ్‌ నుంచి వచ్చిందా. రూపం ఆడ గొంతు మగ.. అసలు అమ్మవారు నిజంగా ఆడమనిషేనా. అసలు ఈమె బ్యాగ్రౌండ్‌ ఏంటి. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో ఉన్న డౌట్స్‌ ఇవే. కొన్ని రోజుల నుంచి తెలంగాణలో అఘోరీ నాగసాధుగా చలామణీ అవుతున్న ఈమె.. సారీ.. ఇతని ప్రాపర్‌ మంచిర్యాల జిల్లాలోని నన్నేల మండలం కుషన్‌పల్లి. ఇతని అని ఎందుకు అన్నానంటే ఈ అఘోరీ లేడీ కాదు. అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన హిజ్రా. కుషన్‌పల్లి అనే విలేజ్‌లో ఉండే చిన్నయ్య, చిన్నక్క దంపతుల మూడో సంతానం ఈ శ్రీనివాస్‌. చిన్నయ్యకు మొత్తం నలుగురు పిల్లలు. శ్రీనివాస్‌ అలియాస్‌ అఘోరీ చిన్నయ్యకు మూడో కొడుకు. శ్రీనివాస్‌కు ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. వెళ్లిపోయిన కొన్నాళ్లకే అతను ఆపరేషన్‌ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు.

ఆ తరువాత కేదార్‌నాథ్‌కు వెళ్లి అఘోరాల్లో కలిసిపోయాడు. చాలా కాలం నుంచి శ్రీనివాస్‌ కేదార్‌నాథ్‌ వదిలి బయటే తిరుగుతున్నాడు. కొంత కాలం అర్థనారీశ్వరి పేరుతో వివిధ రాష్ట్రాల్లో కనిపించాడు. రీసెంట్‌గా నాగసాధ్‌గా పేరు మార్చుకుని తెలంగాణలో అక్కడక్కడా కనిపిస్తున్నాడు. హుండై ఐ20 టాప్‌ ఎండ్‌ కారు వాడుతున్నాడు, ఐఫోన్‌ 15 ప్రొమ్యాక్స్‌ వాడుతున్నాడు. ఇంగ్లీష్‌లో మాట్లాడుతాడు. ఇవన్నీ ఏంటిని ఎవరైనా ప్రశ్నిస్తే గిఫ్ట్‌ అని చెప్తాడు. లోక కళ్యాణ్‌ కోసం వచ్చాను.. కొన్ని రోజులకు వెళ్లిపోతాను.. నా కారు ఎవరైనా ఆపితే వాళ్లను భస్మం చేస్తాను అని వార్నింగ్‌ ఇస్తాడు. ఫోన్‌ రిజార్జ్‌కి, కారు పెట్రోల్‌కి డబ్బు ఎక్కడివి అంటే భక్తులు గిఫ్ట్‌ ఇస్తారు అంటాడు. ఇవన్నీ పక్కన పెడితే రెండు నెలల నుంచి అఘోరీ పేరుతో ఓ యూట్యూబ్‌ చానల్‌ నడుస్తోంది. ఆమె ఎక్కడికి వెళ్లినా ఆ వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతోంది. తమ దేహం మీద కూడా తమకు మోహం లేకుండా ఉంటారు అఘోరాలు. కానీ ఆమె మాత్రం అనాథ పిల్లలకు అన్నదానం చేస్తానని వెళ్తుంది. ఒక అఘోరీ నుంచి ఇలాంటి పబ్లిసిటీ, ఇలాంటి మెయిటెనెన్స్‌ దేశంలో బహుశా ఇదే మొదటిసారి. చేసేది మంచే కావొచ్చు. కానీ దానికి అఘోరీ అని పేరు పెట్టుకుని చేయాల్సి పని లేదు. బట్‌ విసయం ఏదైనా ఈ అఘోరీ ఇప్పుడు పోలీసులు అదుపులో ఉంది. విషయం కనుక్కుని పోలీసులు వదిసేస్తారా లేదా కేసు బుక్‌ చేసి లోపలేస్తారా చూడాలి.