SS RAJAMOULI: టైటిల్ రాబోతోంది.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
గతంలో మహారాజ్, లేదంటే చక్రవర్తి టైటిల్స్‌లో ఏదో ఒకటి పెట్టబోతున్నారన్నారు. కాని సడన్‌గా ఇప్పుడు చక్ర టైటిల్ కన్ఫామ్ అయ్యేలా ఉంది. చక్ర కేవలం చక్రవర్తిలో ఒక పదం కాదు, అంతకుమించి అని తెలుస్తోంది.

It seems that Rajamouli's movie ssmb29 with Mahesh Babu will be announced on April 9 Ugadi.
SS RAJAMOULI: దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో సూపర్ స్టార్ మహేశ్ బాబు చేయబోయే సినిమా టైటిల్ ఫిక్స్ అయ్యిందా..? గతంలో మహారాజ్, లేదంటే చక్రవర్తి టైటిల్స్‌లో ఏదో ఒకటి పెట్టబోతున్నారన్నారు. కాని సడన్‌గా ఇప్పుడు చక్ర టైటిల్ కన్ఫామ్ అయ్యేలా ఉంది. చక్ర కేవలం చక్రవర్తిలో ఒక పదం కాదు, అంతకుమించి అని తెలుస్తోంది.
Kalki 2898 Ad Release Date : కల్కి రిలీజ్ రూమర్లకు చెక్…
నిజానికి ఆగస్ట్ 9న సినిమాను లాంచ్ చేయాలనేది రాజమౌళి ప్లానింగ్. అంతకకుముందే ఈ సినిమాలో పాత్రలని యానిమేషన్ రూపంలో వీడియో ద్వారా చూపించాలని కూడా రాజమౌళి ప్లాన్ చేశాడు. అందుకు తగ్గట్టే పనులు జరుగుతున్నాయి. ఇంతలో టైటిల్ మీద గుసగుసలు పెరిగాయి. కారణం రాజమౌళి టీం సడన్‌గా చక్ర టైటిల్‌ని రిజిస్టర్ చేయించటమే. మహరాజ్, చక్రవర్తి కాకుండా చక్ర టైటిల్‌నే రాజమౌళి ఫిక్స్ చేయటానికి కారణం.. విష్ణు చక్రం వేటలో హీరో అన్నదే సినిమా కాన్సెప్ట్ అని తెలుస్తోంది.
అదే నిజమైతే నిమాకు చక్ర టైటిల్ పెట్టడం తప్పే కాదు. కాని ఆ మాత్రానికే విష్ణు చక్రం కాన్సెప్ట్‌తో మూవీ వస్తోందని చెప్పలేం. కాని రూమర్స్ మాత్రం అలా వస్తున్నాయి. ఏదేమైనా మహేశ్ బాబు మూవీకోసమే రాజమౌళి చక్ర టైటిల్ రిజిష్టర్ చేశారనే ప్రచారం జరుగుతోంది. అదే నిజమౌతై, మేలో ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ జరగొచ్చు.