Jagannath Rath Yatra : పూరీ జగన్నాథ్ రథయాత్రలో తొక్కిసలాటా.. 400 మంది గాయాలు.. ఒకరు మృతి
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగింది.

Stampede in Puri Jagannath Rath Yatra.. 400 people injured.. One died
ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర వేలాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథ యాత్ర ఆదివారం శోభాయమానంగా సాగింది. భక్తులు ‘జై జగన్నాథ్’, ‘హరిబోల్’ “జై శ్రీ కృష్ణ” అంటూ నినాదాలతో మూడు రథాలను 2.5 కిలోమీటర్ల దూరంలోని గుండిచ దేవాలయం వైపు లాగుతూ తీసుకెళ్లారు. లక్షలాది భక్తులు తరలి రావడంతో.. ఒక్కసారిగా తోపులాట ఘటన చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక ఓ భక్తుడు మరణించాడు. తోపులాట కారణంగా ప్రాణాలు కోల్పోయిన భక్తుడి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.. అదేవిధంగా ఈ ఘటనలో గాయపడ్డ వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి ఆదేశించారు.
ఈ ఘటనకు కారణం..
ఈ సంవత్సరంలో ఒడిశాలోని జగన్నాథుడి రథయాత్ర 53 ఏళ్ల తర్వాత (1971) రెండు రోజులపాటు రథయాత్ర జరిగింది. దీనికి ఒకే సారి.. ఒకే రోజు.. నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నేత్రపర్వండం ఇద తొలి సారి.. ఈ మూడు వేడుకలు నేడు ఒకేసారి జరగనుండడంతో దేశ వ్యాప్తంగా జగన్నాధుడి భక్తులు లక్షాలదీగా తరలి వచ్చారు. మరోవైపు మొట్టమొదటి సారిగా.. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా శ్రీ జగన్నాథుని రథాన్ని లాగి రథయాత్రను ప్రారంభించారు. జగన్నాథుడి రథయాత్రకు భారత రాష్ట్రపతి హాజరు కావడం ఇదే తొలిసారి.. భారీగా రద్దీ పెరిగిపోయింది. దీంతో రథయాత్రలో అపశ్రుతి చోటచేసుకుంది.
ఈ ఘటన లో 400 మంది స్వల్పంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీప హాస్పత్రికి తరలించారు. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చిన చెరా పహారా కార్యక్రమాన్ని నిర్వహించారు. తర్వాత బలభద్రుని తాళ ధ్వజ రథాన్ని ముందుకు నడిపిస్తుండగా జరిగిన తోపులాటలో ఒక భక్తుడు మరణించాడు.